14వేలకు పైగా ఫోన్లకు ఒకటే IMEI నెంబర్‌

  • Published By: Subhan ,Published On : June 5, 2020 / 12:26 PM IST
14వేలకు పైగా ఫోన్లకు ఒకటే IMEI నెంబర్‌

Updated On : June 5, 2020 / 12:26 PM IST

ఒకటే IMEI నెంబర్‌ పై 13వేల 500 ఫోన్లు పనిచేస్తున్న విషయాన్ని గుమనించి పోలీసులు అవాక్కయ్యారు. ఏదైనా ఫోన్లో సిమ్ మారిస్తే ఆ ఫోన్ నెంబర్ IMEI నెంబర్‌ బట్టి కనుక్కోవచ్చు. కానీ, అన్ని వేల ఫోన్లకు ఒకటే IMEI నెంబర్‌ ఉంటే ఎలా.. ఆ తప్పు ఎక్కడ జరిగింది. కచ్చితంగా ఇది మ్యాన్యుఫ్యాక్చరింగ్ సమస్యేనని తయారీదారుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఓ పోలీస్.. సైబర్ క్రైమ్ సెల్‌లో తన ఫోన్‌పై నిఘా పెట్టాల్సిందిగా కోరాడు. ఉన్నట్లుండి ఆగిపోవడం, స్లో అయిపోతుండటంతో అతనికి డౌట్ వచ్చింది. ఇలా జరిపిన విచారణలో నిజాలు బయటపడ్డాయని మీరట్ ఎస్పీ (సిటీ) అఖిలేశ్ ఎన్ సింగ్ వెల్లడించారు. 

అప్పుడే సైబర్ సెల్ కు అదే IMEI నెంబర్‌ తో అంతర్జాతీయంగా 13వేల 500ఫోన్లు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ IMEI ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ నెంబర్ తో ఇన్ని ఫోన్లు ఉండటంపై మ్యాన్యుఫ్యాక్చర్ల పనితీరుపై అనుమానం వ్యక్తమవుతోంది. ఇది చాలా సీరియస్ సెక్యూరిటీ ఇష్యూగా భావిస్తున్నారు. 

మొబైల్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా క్రిమినల్స్ దీనిని అవకాశంగా వాడుకుంటారు. దీనిపై పలు సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేశారు. నిపుణులు జరిగిన పొరబాట్లపై మరింత విచారణ జరుపుతున్నారు.