Hindu:హిందు బాలికలిద్దరిని బలవంతంగా ఎత్తుకెళ్లిన పాక్ పొలిటిషియన్ సోదరుడు.. న్యాయం కోసం బాధిత కుటుంబం డిమాండ్
:కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఒకవైపు ప్రపంచమంతా పోరాటం చేస్తుంటే.. పాకిస్థాన్‌లోని మైనార్టీ హిందువులు మతపరమైన హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇద్దరు మైనర్ హిందు బాలికలను సి

Hindu:కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఒకవైపు ప్రపంచమంతా పోరాటం చేస్తుంటే.. పాకిస్థాన్‌లోని మైనార్టీ హిందువులు మతపరమైన హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇద్దరు మైనర్ హిందు బాలికలను సింధ్ ప్రావిన్స్‌లోని పేరున్న స్థానిక రాజకీయ నేత సోదరుడు ఎత్తుకెళ్లడం వివాదస్పదమైంది. కొన్నాళ్లుగా బాధితుల కుటుంబం నిరంతరం ప్రాణహాని ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించి ఒక వీడియోలో బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. తమ మైనర్ కుమార్తెలు సుతి, షామాను జాతీయ అసెంబ్లీ సభ్యుడు Pir Faisal Shah Jeelani సోదరుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడాని, తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. సింధ్‌లో హిందూ మైనారిటీలు హింసను ఎదుర్కొంటున్నారని, బాలికలు ఇస్లాం మతంలోకి మారుతారని వారు భయపడుతున్నారని ఒక కుటుంబ సభ్యుడు తెలిపారు.
ఇక్కడ మైనారిటీలు హింసను ఎదుర్కొంటున్నారు. మా కుమార్తెలను అపహరించారు. మాకు న్యాయం జరగడం లేదు. నిరంతరం దారుణాలను ఎదుర్కొంటున్నారు. జాతీయ అసెంబ్లీ (MNA) సభ్యుడు పిర్ ఫాసిల్ షా జీలానీ సోదరుడు తమను బెదిరిస్తున్నాడని వాపోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఇంట్లో మిగిలిన కుటుంబ సభ్యుల అపహరణలు కూడా జరుగుతాయని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మైనారిటీలు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు.
ఈ చిత్రహింసలను తాము భరించలేమని, సింధ్ నుండి సురక్షితంగా బయటపడేలా సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. పోలీసులు సైతం బాధితులకు సహాయం చేయడం లేదని, రాజకీయ నేత ప్రభావం వల్ల ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబం వాపోయింది. ‘పోలీసులు మాకు సహకరించడం లేదు. వారు మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లారు. కానీ, బాధితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. పోలీసులు కూడా నిందితుల వైపు మొగ్గు చూపుతున్నారు’ అని ఒక కుటుంబ సభ్యుడు తెలిపారు.
సింధ్ ప్రావిన్స్ పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలోనూ లెక్కలేనన్నీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ముస్లింలు బలవంతంగా హిందూ మైనర్ బాలికలను వివాహం కోసం ఇస్లాం మతంలోకి మార్చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాలికల కుటుంబం అనుమతి లేకుండా ఈ సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం. 1998 జనాభా లెక్కల ప్రకారం.. పాకిస్తాన్ జనాభాలో హిందువులు 1.85 శాతం ఉన్నారు.
హిందువులపై జరిగిన దారుణాల జాబితాలో బలవంతంగా మతమార్పిడి, యువతులను బలవంతంగా అపహరించడం, ఓటింగ్ హక్కులు లేకపోవడం, ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేయడం వంటివి ఎన్నో ఉన్నాయి. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ డిఫెన్స్ (GHRD) అంచనా ప్రకారం.. ఏడాదిలో 1,000 మందికి పైగా హిందూ క్రైస్తవ బాలికలు కిడ్నాప్ కు గురవుతున్నారు. ఇస్లాం మతంలోకి మారవలసి వస్తోంది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP) ప్రతి నెలా సుమారు 25 మంది బాలికలను అపహరణకు గురవుతున్నారని అంచనా వేసింది.