Pakistan Crisis: పాకిస్థాన్లో చేజారిపోతున్న పరిస్థితులు.. నడిరోడ్లపై మళ్లీ రెచ్చిపోతున్న గ్యాంగులు
బహిరంగ ప్రదేశాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లో ఇటువంటి నేరాలు అధికమయ్యాయి. కొన్ని గ్యాంగులు ఏం చేస్తున్నాయో పోలీసులు చెప్పారు.

Pakistan Crisis
Pakistan Crisis: పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో శాంతి, భ్రదతల పరిస్థితులు చేజారిపోతున్నాయి. పాక్ ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ రూపాయి విలువ రోజురోజుకీ క్షీణించిపోతోంది. దీంతో ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు. ఇప్పటికే గోధుమ పిండి వంటి వాటి కోసం ప్రజలు కొట్టుకున్న ఘటనలు జరిగాయి.
కొన్ని రోజులుగా బహిరంగ ప్రదేశాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లో ఇటువంటి నేరాలు అధికమయ్యాయి. దీన్నిబట్టి పాక్ లో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు ఏ మేరకు పెరిగాయో చెప్పవచ్చు. కొన్ని రోజులుగా పాక్ లో కొన్ని గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం కరాచీలో ఇటువంటి గ్యాంగులే కలకలం రేపాయి.
అనంతరం పోలీసులు ఆ గ్యాంగుల ఆటకట్టించారు. మళ్లీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభం కారణంగా అటువంటి గ్యాంగులు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లో పోలీసులకు సవాళ్లుగా మారుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో నేరాలు పెరిగిపోతున్నాయని కరాచీలోని పౌరులు-పోలీసుల అనుసంధాన కమిటీ మీడియాకు తెలిపింది. చోరీలకు పాల్పడుతోన్న సమయంలో ఎవరైనా ప్రతిఘటిస్తే వారిని దొంగలు అక్కడికక్కడే చంపేస్తున్నారు. 2023లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 21,000 నేరపూరిత కేసులు నమోదయ్యాయి.
నిజానికి అటువంటి ఘటనల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఈ మూడు నెలల్లో దొంగలు 34 మందిని హత్య చేశారు. మరో 150 మందిని తీవ్రంగా గాయపర్చారు. కార్లు, మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్ల చోరీల కేసులు 20,000 దాటింది. రావల్పిండిలోనూ అటువంటి 89 కేసులు నమోదయ్యాయి. రూ.35 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను చోరీ చేశారని పాక్ మీడియా తెలిపింది. పాక్ లోని అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. అమాయక ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు.
Instagram Job Scam: ఉద్యోగం కోసం ఇన్స్టాగ్రాంలో అప్లై చేస్తే.. బ్యాంకు నుంచి రూ. 8.6 లక్షలు మాయం