Trichy airport : కౌలాలంపూర్ నుంచి విమానంలో కొండచిలువలు తెచ్చిన ప్రయాణికుడు

కౌలాలంపూర్ నుంచి ట్రాలీ బ్యాగుల్లో కొండచిలువలు, బల్లులు తీసుకువచ్చిన ఘటన తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగుచూసింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్ నుంచి 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు....

Trichy airport : కౌలాలంపూర్ నుంచి విమానంలో కొండచిలువలు తెచ్చిన ప్రయాణికుడు

pythons, lizards

Updated On : July 31, 2023 / 12:37 PM IST

Trichy airport : కౌలాలంపూర్ నుంచి ట్రాలీ బ్యాగుల్లో కొండచిలువలు, బల్లులు తీసుకువచ్చిన ఘటన తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగుచూసింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్ నుంచి 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహమ్మద్ మొయిదీన్‌ అనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.

Manipur viral video case : సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ మహిళా బాధితులు

మహమ్మద్ మొయిదీన్ బాటిక్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు మొయిదీన్ ను అడ్డుకున్నారు. (Trichy airport) అతని ట్రాలీ బ్యాగులు విప్పి చూడగానే అందులో కొండచిలువలు దర్శనమివ్వడంతో కస్టమ్స్ అధికారులు షాక్ కు గురయ్యారు. (Passenger lands with 47 pythons, 2 lizards)

California airport : కాలిఫోర్నియాలో హ్యాంగర్‌ను ఢీకొన్న చిన్న విమానం…ముగ్గురి మృతి

అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం కొండచిలువలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. విచారణ నిమిత్తం మొయిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.