వడ్డీ చెల్లించ లేదని భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి

  • Published By: chvmurthy ,Published On : April 16, 2020 / 01:40 PM IST
వడ్డీ చెల్లించ లేదని భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి

Updated On : April 16, 2020 / 1:40 PM IST

అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బానోత్ హన్మా అనే  వడ్డీ వ్యాపారి వద్ద రూ.2 లక్షలు అప్పు చేశాడు. తీసుకున్న అప్పుకు గాను ఇటీవల రూ.1.50 లక్షలు తిరిగి చెల్లించాడు. 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా మిగిలిన అసలు వడ్డీ చెల్లించేందుకు కొంత సమయం కావాలని అడిగాడు. అందుకు ఒప్పుకోని వడ్డీ వ్యాపారి హన్మ…. హట్యా ఇంటికి  వెళ్లి అతని భార్యను లాక్కోచ్చి తన ఇంట్లో నిర్భందించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   (శుక్ర, శనివారాల్లో రెండు మిలిటరీ ప్రత్యేక రైళ్లు)