చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్రమ ఆయుధాల కలకలం

illegal weapons: చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్రమ ఆయుధాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. మదనపల్లి మండలం వేంపల్లి క్రాస్ వద్ద ఫరూక్ అనే వ్యక్తి దగ్గర రెండు గన్స్, 29 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లా సరిహద్దు దాటి బెంగళూరుకు వెళుతుండగా చెక్ పోస్ట్ దగ్గర తనిఖీల్లో పట్టుబడ్డాడు నిందితుడు. పట్టుబడ్డ వ్యక్తి సదుం మండలం వాసిగా గుర్తించారు.
https://10tv.in/cricket-betting-mafia-attack-young-man-in-nellore/
నిందితుడు ముంబైలో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇతనిపై ఇదివరకే గంజాయి అక్రమ రవాణా కేసు కూడా ఉందని తెలిపారు. గన్స్‌ను నవంబర్ 1న ముంబై నుంచి స్వగ్రామం సదుంకు తీసుకొచ్చినట్లు గుర్తించారు. తిరిగి వీటిని రహస్యంగా బెంగళూరుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. అక్రమ ఆయుధాల తరలింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు మదనపల్లి పోలీసులు. పట్టుబడ్డ ఫరూక్ ను, అతని అన్నను విచారిస్తున్నట్లు చెప్పారు.