Youtuber Bayya Sunny Yadav : యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్ కు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!
త్వరలోనే అతడిని పట్టుకుంటామని సూర్యాపేట పోలీసులు చెబుతున్నారు.

Youtuber Bayya Sunny Yadav : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. యూట్యూబర్ సన్నీ యాదవ్ పై నూతన్ కల్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇండియాకు వచ్చిన వెంటనే సన్నీయాదవ్ ను అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ నెల 5న సన్నీయాదవ్ పై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై సుమోటోగా కేసు నమోదైంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని సూర్యాపేట పోలీసులు చెబుతున్నారు. దేశ విదేశాల్లో బైక్ పై రైడ్స్ చేస్తున్న సన్నీ యాదవ్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు.
Also Read : బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. ప్రభాస్, బాలయ్య, గోపీచంద్ పై ఫిర్యాదు
ఇక ఈ కేసులో విచారణకు హాజరుకావాలని యాంకర్ శ్యామలకు హైకోర్టు సూచించింది. దీంతో యాంకర్ శ్యామల సోమవారం పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ ల విచారణ పూర్తైంది. మరికొంతమంది ప్రమోటర్లు, ఇన్ ఫ్లుయన్సర్లు విచారణకు రాలేదు. అటు సినీ ప్రముఖల విషయంలో న్యాయ సలహా తీసుకోనున్నారు పోలీసులు.