Medha School : ఉదయం స్కూల్, రాత్రి డ్రగ్స్ తయారీ.. కల్లు కాంపౌండ్‌లకు విక్రయం.. మేధా స్కూల్ కరస్పాండెంట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

స్కూల్లో మత్తుమందు తయారు చేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఫ్యాక్టరీ పెట్టారట.

Medha School : ఉదయం స్కూల్, రాత్రి డ్రగ్స్ తయారీ.. కల్లు కాంపౌండ్‌లకు విక్రయం.. మేధా స్కూల్ కరస్పాండెంట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Updated On : September 16, 2025 / 1:56 AM IST

Medha School : మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్ గౌడ్ ను కోర్టులో హాజరుపరిచింది ఈగల్ టీమ్. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. జయప్రకాశ్ గౌడ్ రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు పొందుపరిచారు పోలీసులు. డబ్బు సంపాదనే లక్ష్యంగా మత్తుమందురు తయారు చేసినట్లు జయప్రకాశ్ అంగీకరించారు. స్కూల్ ని అడ్డం పెట్టుకొని మత్తుమందు తయారు చేసి విక్రయించారు.

స్కూల్లో మత్తుమందు తయారు చేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఫ్యాక్టరీ పెట్టారట. గురువారెడ్డి దగ్గరి నుంచి ఫార్ములాని కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిపారు. ఆరుసార్లు మత్తుమందు తయారు చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏడోసారి సక్సెస్ అయిన తర్వాత కల్లులో మత్తుమందును కలిపి ఇచ్చానన్నారు. తయారు చేసిన మత్తుమందుతో కిక్కు రావడంతో వినియోగారులు హ్యాపీగా ఫీలయ్యారని తెలిపారు.

రోజుకు కిలో చొప్పున మత్తు మందుని తయారు చేశారు. తయారు చేసిన మత్తు మందుని స్కూటీపైన తీసుకెళ్లి సప్లయ్ చేశారు. మత్తుమందు తయారు చేసే ఫ్లోర్ లో పిల్లలకు ట్యూషన్లు మాత్రమే చెప్పానని పోలీసులతో చెప్పారు. పగటి పూట స్కూల్ తరగతులు నడిపించి రాత్రి మత్తు మందు తయారు చేశానన్నారు. మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ లోని పలు కల్లు కాంపౌండ్ లకి మత్తుమందు సప్లయ్ చేశానని పోలీసులతో చెప్పారు.