నిర్భయ దోషి అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 03:23 PM IST
నిర్భయ దోషి అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి

Updated On : February 5, 2020 / 3:23 PM IST

నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దోషుల ఉరిశిక్ష వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఉరిశిక్షను తప్పించుకోవడానికి నిర్భయ దోషులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. నిర్భయ తల్లి ఆశా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దోషుల ఉరిశిక్షపై స్టే విధించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్భయ దోషి అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్  ను రాష్ట్రపతి తిరస్కరించారు. 

నిర్భయ దోషుల దొంగాటకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టింది. దోషులకు వారం రోజులే గడువు ఇచ్చింది. క్షమాభిక్ష అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి వారం రోజులే గడువు ఇచ్చింది. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తెలిపింది. వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం వినతిని కోర్టు తోసిపుచ్చింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలును వెంటనే జరపాలని కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష ఒకేసారి అమలు కావాల్సివుంటుంది. దీనికి సంబంధించిన జైలు నిబంధనలు 834, 836 అంశాలను కోడ్ చేస్తూ ఆర్టికల్ 21ను ఉపయోగించి వీరు ఉరిశిక్ష అమలును జాప్యం చేస్తున్నారన్న విషయాన్ని కూడా హైకోర్టు వ్యక్త పరిచింది.

అయితే న్యాయపరంగా వీరికి ఉన్న అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు నుంచి వారం రోజుల్లోపు దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాల్సివుంటుంది. ఇప్పటికే వినయ్, ముఖేష్ కు సంబంధించి న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. పవన్ కు సంబంధించి క్యురేటివ్ పిటిషన్, అలాగే మెర్సీ పిటిషన్ ఫైల్ చేయాల్సివుంది. వారం రోజుల్లోగా న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. 

తదుపరి వీరు వినియోగించుకున్న న్యాయమైన అవకాశాల ఆధారంగానే చట్టపరంగా వ్యవహరించాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వీరికి వారం రోజుల సమయం విధించడంతో ఒకరి తర్వాత ఒకరు కాకుండా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలన్న నిబంధనకు లోబడే ముఖ్యంగా వీరికున్న అవకాశాలను వినియోగించుకోవాలని హైకోర్టు ఆఖరి అవకాశం ఇచ్చింది. జైలు నిబంధనల్లో ఉన్న లొసుగులకు సంబంధించి సొలిసిటర్ జనరల్ వాదనలను పరిగణనలోకి తీసుకొని, వేర్వేరుగా వీరికి ఉరిశిక్ష విధించలేమని తెలిపింది. అందుకు నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని, తీహార్ జైలు నిబంధనలను కోడ్ చేస్తూ ఆ విధంగా ఉరితీయలేమన్న అంశాలను హైకోర్టు స్పష్టం చేసింది. 

నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. క్షమాభిక్ష అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని హైకోర్టు తెలిపింది. వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం వినతిని తోసిపుచ్చింది. నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.