Hyderabad : పంజాగుట్ట చిన్నారి హత్య, అమ్మే చంపేసింది?
హైదరాబాద్ పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు చిక్కుముడి వీడింది. బాలిక తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని సమాచారం. వివాహేతర సంబంధం ఇందుకు కారణమని చెప్తున్నారు.

Crime
Punjagutta Four Years Child : హైదరాబాద్ పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి హత్య కేసు చిక్కుముడి వీడింది. బాలిక తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని సమాచారం. వివాహేతర సంబంధం ఇందుకు కారణమని చెప్తున్నారు. చిన్నారిని ఇద్దరు కలిసి చంపారని పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఇద్దరు నిందితులను రాజస్థాన్ అజ్‌మేర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకులు పాతబస్తీకి చెందినట్టు గుర్తించారు. ఈ నెల 4వ తేదీన పంజాగుట్ట పరిధిలోని ద్వారకాపురి కాలనీలో ఓ షాపు ఎదుట నాలుగేళ్ల చిన్నారి మృతదేహం పడి ఉండడం కలకలం రేపింది.
Read More : CM Stalin : మహిళా ఎస్ఐపై సీఎం స్టాలిన్ ప్రశంసలు
అదే రోజు అమావాస్య కావడంతో క్షుద్రపూజలు చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. పాపను కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు తేలడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. బెంగళూరు నుంచి ఎంజీబీఎస్ వచ్చి పంజాగుట్ట వరకు నిందితులు ఆటోలో వచ్చారు. కర్ణాటకలో హత్య చేసి డెడ్‌బాడీని హైదరాబాద్ తీసుకొచ్చి మరీ పడేసి పోయారు.
Read More : Cyber Crime : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది..పెళ్లి చేసుకుంటానంది, రూ. 95 లక్షలు కొట్టేసింది
అక్కడి నుంచి నడుచుకుంటూ మహిళ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలకాధారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రల్లో గాలించారు. నిందితుల జాడ తెలియడంతో ఎట్టకేలకు పట్టుకున్నారు. బాలిక తండ్రి చనిపోవడంతో ఆమె.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, వారు యాచకులని పోలీసులకు ఆధారాలు లభించాయి.