Inter-State Gang Arrest :హైదరాబాద్‌లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు
హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

Inter-State Gang Arrest
Inter-State Gang Arrest : హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ నుంచి హైదరాబాద్ కు మత్తు మందు దిగుమతి చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్ వోటీ, నేరేడ్ మెట్ పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి 750 గ్రాముల ఓపీఎం, 500 గ్రాముల పాపిస్టా స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటి విలువ రూ.12.5 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. వారు ప్రయణిస్తున్న కారును కూడా సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. నగరంలోని వ్యాపారస్తులకు డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
Drugs Racket : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో నలుగురిని ఎల్ బీ నగర్ ఎస్ వోటీ, సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 గ్రాముల హెరాయిన్, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.