హోటల్‌లో దారుణం : దుబాయ్ నుండి వచ్చి భార్యను చంపేశాడు

హైదరాబాద్ : నగరంలో మర్డర్స్, క్రైం ఘటనలు పెరిగిపోతున్నాయి. జీవితాంతం తోడు నీడనై రక్షగా నిలుస్తానని బాసలు చేసిన భర్త..భార్యను కాటికి పంపాడు. ఏకంగా దుబాయ్ నుండి వచ్చి చంపేశాడు. చంపడానికి కారణం కేవలం అనుమానం. ఈ ఇన్సిడెంట్ సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. గద్వాల్‌కు చెందిన రహీం ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. ఇతనికి వివాహమైంది. అయితే..ఈమె ఎవరితోనో మాట్లాడుతోందని..అక్రమ సంబంధం పెట్టుకుందని రహీం అనుమానించాడు. ఈ విషయంలో తరచూ ఇద్దరి మధ్య ఫోన్‌లో గొడవలు జరుగుతుండేవి.
దుబాయ్ నుండి హైదరాబాద్‌కు రహీం వచ్చాడు. సికింద్రాబాద్‌లోని గోపాలపురం పీఎస్ పరిధిలో ఓ లాడ్జీలో దిగాడు. అనంతరం భార్యకు ఫోన్ చేసి రమ్మన్నాడు. లాడ్జ్‌కి వచ్చిన ఆమెతో రహీం వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగిందని తెలుస్తోంది. కోపోద్రిక్తుడైన రహీం…ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. భార్యను చంపేసినట్లు పోలీసులకు ఫోన్ చేశాడు. వారు లాడ్జీలోకి వచ్చేంత వరకు గదిలోనే నిందితుడు ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.