BJP MLA Pratap Bheel Rape Case : ఉద్యోగం పేరుతో మహిళలపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు మహిళలపై ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఘటన రాజస్ధాన్ లో చోటు చేసుకుంది. 

BJP MLA Pratap Bheel Rape Case : ఉద్యోగం పేరుతో మహిళలపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

Pratap Bheel

Updated On : November 19, 2021 / 9:12 AM IST

BJP MLA Pratap Bheel Rape Case :  ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు మహిళలపై ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఘటన రాజస్ధాన్ లో చోటు చేసుకుంది.  గోగుండ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్‌భీల్ తన పై లైంగిక దాడికి   పాల్పడ్డాడని బాధిత మహిళ ఇటీవల అంబామాత ఎస్పీని ఆస్రయించింది.

ప్రతాప్‌భీల్ ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్ళి చేసుకుంటానని చెప్పి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కోంది. సుఖేర్ లో 10 నెలల క్రితం ప్రతాప్ భీల్ పై అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి సీఐడీ విచారణ కొనసాగుతోంది.

తాజా కేసులో మహిళ ఫిర్యాదు  ప్రకారం   ఉద్యోగం కోసం..ప్రతాప్ భీల్ తనను కలిసిన  తర్వాత  తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని మహిళ   తెలిపింది.   అప్పటి నుంచి అతడు ఏదో ఒక నెపంతో తనకు ఫోన్  చేస్తూనే ఉన్నాడని….గతేడాది మార్చిలో తన ఇంటికి వచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని కూడా ఆరోపించింది.

గత 10 నెల్లల ప్రతాప్ భీల్ పై రెండు అత్యాచారం కేసులు నమోదవటం కలంకలం రేపుతోంది. ఈ రెండు కేసుల్లోనూ మహిళలను ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి, పెళ్లి పేరుతో అత్యాచారం చేయటం జరిగింది. కాగా ఎమ్మెల్యే ప్రతాప్ భీల్  ఈఆరోపణలను కొట్టిపారేశారు.