వరంగల్ సెంట్రల్ జైల్లో రేపిస్టులు
వరంగల్ సెంట్రల్ జైల్ రేపిస్టులకు అడ్డాగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ కీలక నిందితులంతా అక్కడే ఊచలు లెక్కబెడుతున్నారు.

వరంగల్ సెంట్రల్ జైల్ రేపిస్టులకు అడ్డాగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ కీలక నిందితులంతా అక్కడే ఊచలు లెక్కబెడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ కీలక నిందితులంతా వరంగల్ సెంట్రల్ జైల్ ఊచలు లెక్కబెడుతున్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత… సెంట్రల్ జైల్లోని మానవ మృగాలకు కూడా అలాంటి శిక్షే విధించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దేశంలో రోజురోజుకీ అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోవడం అందరిని కలిచివేస్తోంది.
ఇటీవల తెలంగాణలోనూ మానవ మృగాలు పెరిగపోయాయి. హజీపూర్‌లో అమ్మాయిలపై అత్యాచారం, ఆపై హత్యచేసి పూడ్చిపెట్టిన నిందితుడు మర్రి శ్రీనివాన్‌రెడ్డి నుంచి… 9 నెలల పసిపాప చిన్నారిని చంపేసిన ప్రవీణ్.. తాజాగా మానసను అత్యంత క్రూరంగా చంపేసిన సాయిగౌడ్ వరకు… ఇలా అందరూ ప్రధాన నిందితులంతా వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. హజీపూర్ నిందితుడు శ్రీనివాసరెడ్డిని నెల క్రితం ప్రొటోకాల్ సమస్యతో నల్గొండ జైల్‌కు తరలించారు.
ఈ ఏడాది జూన్ 18న హన్మకొండలో 9 నెలల చిన్నారి హత్యతో యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. నిందితుడు ప్రవీణ్‌ను చంపేయాలంటూ అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పది రోజుల క్రితం సరిగ్గా దిశ ఘటన జరిగిన రోజే నవంబర్ 27న హన్మకొండలోని దీన్‌దయాల్ కాలనీకి చెందిన మానస అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వంచించి పుట్టినరోజు నాడే కడతేర్చాడు సాయిగౌడ్. నాలుగు నెలల క్రితం ఆగస్టు 10న సమ్మయ్యనగర్ కాలనీకి చెందిన మైనర్ బాలికపై ఎర్రగట్టు గుట్ట సమీపంలో ఇద్దరు సామూహిక అత్యాచారం చేయడంతో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఈ కేసులో నిందితులు ప్రసన్నకుమార్, తిరుపతి వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఫిబ్రవరి 27న హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థిని రవళిపై… సాయిఅన్వేష్ అనే ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడ్డ రవళి… వారం రోజుల చికిత్స తర్వాత కన్నుమూసింది. దిశ ఘటన కంటే ముందు హాజీపూర్ వరుస హత్యలు జనాన్ని కలవరపెట్టాయి. ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అన్ని కేసుల్లోనూ నిందితులంతా వరంగల్ సెంట్రల్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. హజీపూర్ వరుస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కూడా గత నెల వరకూ ఇక్కడే ఉన్నాడు.
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌తో మిగతా కేసుల్లోనూ ఇలాంటి డిమాండ్లే వినిపిస్తున్నాయి. ఆడపిల్లలను అన్యాయం పొట్టనబెట్టుకున్న మానవ మృగాల్ని చంపేయాలని జనం కోరుతుండటంతో… అందరి దృష్టీ వరంగల్ సెంట్రల్ జైలు పైనే ఉంది.