Recording Dances : అనపర్తిలో అశ్లీల నృత్యాలు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి.

Recording Dances : అనపర్తిలో అశ్లీల నృత్యాలు

Recording Dances At Anaparthi

Updated On : November 15, 2021 / 6:16 PM IST

Recording Dances :  తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. ఆదివారంనాడు నల్లమల్ల రామారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు సమావేశంజరిగింది. 1996-97 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.

Also Read : AP Covid-19 Update : ఏపీలో కొత్తగా 117 కోవిడ్ కేసులు

భోజనాలు అయిన అనంతరం  సాయంత్రం కాలేజీ  వెనుక ఉన్న తోటలో అశ్లీల ప్రదర్శనలు బహిరంగంగా నిర్వహించారు. దీంతో వనభోజనాలకు వచ్చిన పెద్దలు, మహిళలు నిర్వాహకుల తీరును ఖండించారు. పోలీసులు ఎలాంటి చర్యలు లేకుండా ఉదాసీనంగా ఉండి పోయినట్లు పలువురు విమర్శించారు.