న‌మ్మించి… న‌ట్టేట‌ముంచాడు

తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్ట‌డం అంటే ఇదేనేమో. మంచివాడిగా ముద్ర‌వేసుకుని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కొన్ని రోజుల‌కే వారి కుటుంబానికి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఇక అంద‌రూ న‌మ్మేస‌రికి అస‌లు రూపం బ‌య‌ట‌పెట్టాడు. మంచిత‌నాన్ని ఆస‌రాగా తీసుకుని దొంగగా అవ‌తార‌మెత్తాడు.

  • Published By: veegamteam ,Published On : January 4, 2019 / 05:15 AM IST
న‌మ్మించి… న‌ట్టేట‌ముంచాడు

తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్ట‌డం అంటే ఇదేనేమో. మంచివాడిగా ముద్ర‌వేసుకుని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కొన్ని రోజుల‌కే వారి కుటుంబానికి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఇక అంద‌రూ న‌మ్మేస‌రికి అస‌లు రూపం బ‌య‌ట‌పెట్టాడు. మంచిత‌నాన్ని ఆస‌రాగా తీసుకుని దొంగగా అవ‌తార‌మెత్తాడు.

తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్ట‌డం అంటే ఇదేనేమో. మంచివాడిగా ముద్ర‌వేసుకుని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కొన్ని రోజుల‌కే వారి కుటుంబానికి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఇక అంద‌రూ న‌మ్మేస‌రికి అస‌లు రూపం బ‌య‌ట‌పెట్టాడు. మంచిత‌నాన్ని ఆస‌రాగా తీసుకుని దొంగగా అవ‌తార‌మెత్తాడు.
పీర్జాదిగూడ మున్సిపల్‌ పరిధిలోని సిరిపురి కాలనీలో ఉంటున్న నరేంద్ర మేస్త్రిగా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం అత‌డు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులకొట్టింది. బీరువాలో మూడు తులాల బంగారం మాయ‌మైంది. అది గుర్తించిన నరేంద్ర వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో గురువారం మేడిపల్లి కమాన్‌ వద్ద పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన విజయేంద్ర అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగ‌త‌నం చేసిన‌ట్టు అంగీక‌రించాడు. గద్వాల్‌జిల్లా, రాజపురం గ్రామానికి చెందిన విజయేంద్ర గత కొంత కాలంగా నరేంద్ర ఇంట్లో అద్దెకు ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం విజ‌యేంద్ర‌.. నరేంద్ర ఇంటికి తాళం పగులకొట్టి నెక్లెస్‌, చోరీ చేసినట్లు విచారణలో తేలింది. అద్దెకు ఉంటూ ఓనర్‌ ఇంట్లోనే దొంగ‌త‌నం చేసిన‌ట్టు విచార‌ణ‌లో పోలీసులు గుర్తించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు బైక్‌లు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 3 తులాల నెక్లెస్‌, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.