ముఖానికి మాస్క్: రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య
జాదవ్ పూర్ యూనివర్శిటీకి చెందిన 26 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

జాదవ్ పూర్ యూనివర్శిటీకి చెందిన 26 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కోల్ కతా: జాదవ్ పూర్ యూనివర్శిటీకి చెందిన 26 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జాదవ్ పూర్ యూనివర్శిటీ ఏరియాలోని హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. జాదవ్ పూర్ యూనివర్శిటీలో మైక్రోబయాలజీ రీసెర్చ్ స్కాలర్ సుకన్య పొడార్ (26) హాస్టల్ గదిలో సీలింగ్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ గది తాళాలు పగలగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే సుకన్య మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న సుకన్య ముఖానికి నల్ల మాస్క్ ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ రీసెర్చ్ స్కాలర్ గా చేస్తూనే.. ఓ కాలేజీలో సుకన్య పార్ట్ టైం టీచర్ గా పనిచేస్తున్నట్టు విచారణలో గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.