పెళ్లి విషయంలో గొడవ…గాల్లోకి కాల్పులు జరిపిన రిటైర్డ్ ఆర్మీ

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో కాల్పుల కలకలం రేగింది. రిటైర్డ్ ఆర్మీ బద్ధం తిరుమల్ రెడ్డి గాలిలోకి కాల్పులు జరిపారు.

  • Published By: veegamteam ,Published On : February 14, 2020 / 04:51 AM IST
పెళ్లి విషయంలో గొడవ…గాల్లోకి కాల్పులు జరిపిన రిటైర్డ్ ఆర్మీ

Updated On : February 14, 2020 / 4:51 AM IST

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో కాల్పుల కలకలం రేగింది. రిటైర్డ్ ఆర్మీ బద్ధం తిరుమల్ రెడ్డి గాలిలోకి కాల్పులు జరిపారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో కాల్పుల కలకలం రేగింది. రిటైర్డ్ ఆర్మీ బద్ధం తిరుమల్ రెడ్డి గాలిలోకి కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. తిరుమల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గురువారం (ఫిబ్రవరి 13, 2020) రాత్రి సాయంపేటలో ఓ పెళ్లి విషయంలో గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన తిరుమల్ రెడ్డి తన వద్ద ఉన్న గన్ తీసుకొచ్చి గాల్లోకి కాల్పులు జరిపాడు. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆయుధం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై స్పష్టత లేదు. కాల్పుల విషయం తెలుసుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే గ్రామానికి వచ్చి విచారణ కొనసాగించారు. 

తిరుమల్ రెడ్డిని అదుపులోకి విచారిస్తున్నారు. అతను కాల్పులు జరిపిన గన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తిరుమల్ రెడ్డిని తరలించారు. ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది. బుల్లెట్లు ఉన్నాయా… ఇంకా ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్