Rohini Court Explosion : కోర్టులో పేలుడు.. పక్కింట్లోని లాయర్‌ని చంపేందుకు సైంటిస్ట్ ఖతర్నాక్ స్కెచ్

ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ నెల 9న జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి.

Rohini Court Explosion

Rohini Court Explosion : ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ నెల 9న జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఓ న్యాయవాదిని చంపేందుకు ఈ పేలుడుకు పాల్పడినట్టు గుర్తించారు. దీని వెనుక మాస్టర్ మైండ్ డీఆర్డీవో సైంటిస్ట్ అని తెలిసి విస్తుపోయారు.

డీఆర్డీవోకు చెందిన భరత్‌ భూషణ్‌ కఠారియా అనే శాస్త్రవేత్తకు తన పక్కింట్లో ఉండే న్యాయవాది అమిత్‌ విశిష్ట్‌ కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు ఒకరిపై ఒకరి కేసులు పెట్టుకున్నారు. అయితే లాయర్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు భరత్‌ భూషణ్.

Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్

దీని కోసం తాను ముందుగా తయారు ఐఈడీ బాంబును టిఫిన్‌ బాక్స్‌లో పెట్టి ఢిల్లీలోని రోహిణి కోర్టులో గల 102వ నెంబర్‌ గదిలో ఉంచాడు. దీంతో ఆ గదిలో స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ కేసు విచారణలో భరత్‌ భూషణ్‌ నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్టులో ఓ విచారణకు న్యాయవాది హాజరు అవుతాడని అంచనా వేసిన డీఆర్డీవో శాస్త్రవేత్త కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు అమర్చినట్టు పోలీసులు తెలిపారు.

Corona Pfizer : అప్పటివరకు కరోనా అంతం కాదు..! షాకింగ్ విషయం చెప్పిన ప్రముఖ ఫార్మా కంపెనీ

కొన్నాళ్లుగా ఇరువురి మధ్య అనేక న్యాయపోరాటాలు సాగుతున్నాయి. డీఆర్డీవో శాస్త్రవేత్త భరత్ భూషణ్ పై న్యాయవాది అమిత్ వశిష్ట్ 7 కేసులు పెట్టగా… ఆ న్యాయవాదిపై భరత్ భూషణ్ 5 కేసులు పెట్టాడు. ఓ వివాదంలో న్యాయవాది వైఖరితో రగిలిపోతున్న భరత్ భూషణ్… అతడిని అంతమొందించాలని భావించి స్వయంగా ఐఈడీ బాంబు తయారు చేశాడని, దాన్ని కోర్టులోని 102వ నెంబర్ గదిలో అమర్చాడని పోలీసులు వివరించారు.

Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా భరత్ ను గుర్తించిన‌ట్లు పోలీసులు చెప్పారు. రెండుసార్లు భరత్ క‌నిపించాడ‌ని, ఒక‌సారి పేలుడు ప‌దార్ధాలు ఉన్న బ్యాగుతో.. రెండ‌వ సారి బ్యాగు లేకుండా క‌నిపించిన‌ట్లు పోలీసులు తెలిపారు. లాయర్ అమిత్ భరత్ పై 7 కేసులు న‌మోదు చేయడంతో ప్ర‌తీకారంతో రగిలిపోయిన సైంటిస్ట్ భరత్.. లాయర్ ని మట్టుపెట్టేందుకు ఈ పేలుడుకు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు చెప్పారు.