Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మాగుంట రాఘవరెడ్డి జ్యూడీషియల్ కస్టడీని మార్చి 28 వరకు పొడిగించింది.

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీ పొడిగింపు

Magunta Raghavareddy

Updated On : March 19, 2023 / 11:45 AM IST

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మాగుంట రాఘవరెడ్డి జ్యూడీషియల్ కస్టడీని మార్చి 28 వరకు పొడిగించింది. లిక్కర్ మనీలాండరింగ్ స్కామ్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉండటంతో మాగుంట రాఘవరెడ్డి జ్యూడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది.

Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

దీంతో కోర్టు ఏకీభవించి మాగుంట జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం మాగుంట రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉన్నారు. ఫిబ్రవరి 10న మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. మరోవైపు రాఘవ తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి శనివారం ఈడీ విచారణకు హాజరు కాలేదు. తాను విచారణకు రాలేనని ఈడీకి లేఖ రాశారు.