తిరుపతిలో రౌడీ షీటర్ ను నరికి చంపారు
తిరుపతిలో రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలకం రేపింది. నిన్న రాత్రి రౌడీషీటర్ మురళిని గుర్తు తెలియన వ్యక్తలు హత్య చేశారు.

తిరుపతిలో రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలకం రేపింది. నిన్న రాత్రి రౌడీషీటర్ మురళిని గుర్తు తెలియన వ్యక్తలు హత్య చేశారు.
తిరుపతిలో రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలకం రేపింది. నిన్న రాత్రి రౌడీషీటర్ మురళిని గుర్తు తెలియన వ్యక్తలు హత్య చేశారు. పాత కక్ష్యలతోనే అతనిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సీపీ టీవీ ఫుజేటీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో 8 మంది పాల్గొన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్గవ్ స్నేహతులే మురళిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
బెల్టు మురళి అలియాస్ పసుపులేటి మురళి అనే రౌడీషీటర్ నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరుమల బైపాస్ రోడ్డులో అమానుషంగా నరికి చంపారు. ఎస్ కే లీలామహల్ సెంటర్ లోని ఎస్ కే ఫాస్ట్ ఫుడ్ దగ్గర మురళిని దుండుగులు కత్తులతో నరికి చంపారు. వీపు, కంటిపై కత్తి గాట్లు ఉన్నాయి. శరీరంపై తీవ్రమైన కత్తి గాట్లు ఉన్నాయి. తీవ్ర గాయాలైన మురళి స్పాట్ లోనే మరణించారు. నడిరోడ్డుపై ఈ దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భార్గవ్ స్నేహతులే మురళిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిజానికి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే మురళిపై రౌడీ షీట్ దాఖలు అయింది. దీంతోపాటు పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. ప్రధానంగా 2017, డిసెంబర్ నెలలో తిరుపతిలోని భార్గవ్ అనే యువకుడి హత్య జరిగింది. అప్పుడు యువకుడి హత్య అత్యున్నంగా మారింది. భార్గవ్ హత్య కేసులో బెల్టు మురళి ఏ2 నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మురళిపై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు సమాచారం.
2019, డిసెంబర్ 2న భార్గవ్ ద్వితీయ వర్థంతి జరిగింది. ఆ వర్థంతి వేడుకలోనే అతడి స్నేహితులంతా.. భార్గవ్ ను హత్య చేసిన వారిని చంపితీరుతామని శపథం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన బెల్టు మురళి అప్రమత్తంగానే ఉన్నారు. అనూహ్యంగా మురళి ఇంటి నుంచి బయటికి రావడం రోడ్డుపైకి రావడంతో బైక్ పై, ఆటోలో వచ్చిన ఆరు నుంచి 8 మంది వ్యక్తులు రోడ్డుపైనే మురళిని తరుముతూ కత్తులతో పొడిచి చంపారు. అనంతరం వచ్చిన బైక్ పై, ఆటోలో పరారయ్యారు. సీసీ ఫుటేజీలో కూడా నిందితుల దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపించాయి. భార్గవ్ స్నేహితులే మురళిని మట్టుపెట్టి ఉంటారని, లింక్ హత్యగా పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించే ప్రక్రియ దాదాపుగా పూర్తి అయింది. నిందితులు తిరుపతిలో ఉన్నారా? పరారు అయ్యారా? విచారిస్తున్నారు. భార్గవ్ ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకే అతని స్నేహితులు బెల్టు మురళిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.