హిజ్రాలే టార్గెట్: మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌

  • Published By: vamsi ,Published On : March 30, 2019 / 01:35 AM IST
హిజ్రాలే టార్గెట్: మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌

Updated On : March 30, 2019 / 1:35 AM IST

వెంకటేష్ యాదవ్.. ఈ పేరు చెబితే హిజ్రాలు వణికిపోతున్నారు. రెండు హత్య కేసులు, 9 దోపిడీ, దొమ్మీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకటేష్ యాదవ్ టార్గెట్ హిజ్రాలే. అనంతపురం జిల్లా, కక్కాల్‌పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ యాదవ్‌ 2016 జనవరిలో బంజారాహిల్స్, ఇందిరానగర్‌లో బ్రహ్మం అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను హత్యచేసి జైలుకు వెళ్లాడు. అయితే తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. అంతకుముందు 2015లో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రవళిక అనే హిజ్రాను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు వెంకటేష్ యాదవ్, గతేడాది సెప్టెంబర్‌లో ఇందిరానగర్‌లో యాస్మిన్‌ అనే హిజ్రాపై దాడి చేసి నగలు, నగదును ఎత్తుకెళ్లాడు. అప్పటి నుంచి  తప్పించుకుని తిరుగుతున్న అతనిని పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో పెట్టారు.
Read Also : లోకేష్ పప్పు.. పప్పు : జయంతికి.. వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల

ఈ క్రమంలో గత నెలలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో స్వప్న అనే హిజ్రాపై దాడి చేసి నగదు దోచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఖైత్లాపూర్‌లో హిజ్రాలతో మీటింగ్ పెట్టి డబ్బులు వసూలు చేశాడు. కాగా అతడిపై ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయి.  గుండు కొట్టించుకుని మారువేషంలో తిరుగుతూ రోజుకో సిమ్‌కార్డు మారుస్తూ, నాలుగు రాష్ట్రాల్లో తల దాచుకుంటున్న వెంకటేష్‌ను ఎట్టకేలకు బంజారాహిల్స్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ పట్టుకున్నారు.  నాలుగు రోజుల పాటు అనంతపురంలో మకాంవేసి ఓ లాడ్జిలో ఉంటున్న వెంకట్‌ యాదవ్‌ను డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ అరెస్ట్  చేశారు.

2008లో దివ్య అనే హిజ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వెంకటేష్.. హిజ్రాలందరితో పరిచయం పెంచుకున్నాడు. 2015 నాటికి హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలోని దాదాపు 3000 మంది హిజ్రాలను దగ్గరై వాళ్లను బెదిరించుకుని డబ్బులు రాబట్టడం మొదలెట్టాడు. జైలుశిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదు. వెంకటేష్ ఆగడాలను నియంత్రించాలంటూ హిజ్రాలు ధర్నాలు చేసిన సంధర్భాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసు రికార్డుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా నమోదైన వెంకటేష్ పోలీసులకు చిక్కడంతో హిజ్రాలు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?