RTC Bus Incident: సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ప్రయాణికులకు తీవ్ర గాయాలు.. బైక్ ను తప్పించబోయి

ప్రమాద సమయంలో బస్సులో 55 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

RTC Bus Incident: సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ప్రయాణికులకు తీవ్ర గాయాలు.. బైక్ ను తప్పించబోయి

Updated On : April 20, 2025 / 7:04 PM IST

RTC Bus Incident: సూర్యాపేట జిల్లా చింతలపాలెం శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తా పడింది. బైక్ ను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్టీరింగ్ రాడ్ ఊడటంతో బస్సు బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను మేళ్లచెరువు, హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తోంది. ప్రమాదానికి గురైన బస్సు కోదాడ డిపోకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Also Read: డిజిటల్ రేప్ అంటే ఏమిటి? మేదాంత ఆసుపత్రి ఐసీయూలో జరిగిన షాకింగ్ క్రైమ్ ఏంటి..

బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బస్సులో ఉన్న వారిని బయటకు తీయడంలో సాయం చేశారు. బైక్ ను తప్పించబోయే క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన ఘటనలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. స్టీరింగ్ రాడ్ ఊడిపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here