Russia Ukraine Crisis : యుక్రెయిన్ మహిళపై రష్యా సైన్యం అత్యాచారం
రష్యా యుక్రెయిన్ యుధ్ధంలో ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోవైపు యుక్రెయిన్ లో దాడులు కొనసాగిస్తోంది రష్యా. చెప్పేది ఒకటి చేసేది మరోకటి చందంలా రష్యా వ్యవహరిస్తోంది.

russia ukraine war
Russia Ukraine Crisis : రష్యా యుక్రెయిన్ యుధ్ధంలో ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోవైపు యుక్రెయిన్ లో దాడులు కొనసాగిస్తోంది రష్యా. చెప్పేది ఒకటి చేసేది మరోకటి చందంలా రష్యా వ్యవహరిస్తోంది.
పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం లేదంటూనే నివాసితుల ఇళ్లపై బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు రష్యా సైనికులు చేస్తున్న దురాగతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రష్యా సైనికులు మహిళలపై అత్యాచారానికి కూడా పాల్పడుతున్నారు. ఈ మేరకు ఒక యుక్రెయిన్ మహిళపై రష్యా సైనికులు దాడి చేసిన విషాద ఘటనను ఆ దేశ ఎంపీ మరియా మెజెంత్సేవా ఒ క టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
యుక్రెయిన్ లో సంచరిస్తున్నరష్యా సైనికులు మహిళ ఇంటి వద్దకు వచ్చి మొదట ఆ ఇంట్లోని పెంపుడు కుక్కను చంపారని, ఆ తర్వాత మహిళ భర్తను చంపినట్లు తెలిపింది. తదనంతరం రష్యా సైనికులు మహిళ తలపై గన్‌పెట్టి తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని బెదిరించి మహిళపై ఆత్యాచారం చేశారని తెలిపింది.
ఆ సమయంతో ఆమె నాలుగేళ్ల కొడుకు భయంతో బాయిలర్ రూమ్‌లో గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడాంటూ బాధిత మహిళ ఆ నాటి ఘటనను గుర్తుతెచ్చుకుంటూ కన్నీటి పర్యంతమైందని ఎంపీ వివరించారు. ఆ తర్వాత మహిళ తన కుమారుడితో అక్కడి నుంచి భయంతో పారిపోయిందని… ఆమె భర్త శవాన్ని కూడా అక్కడే వదిలేశారని చెప్పింది. ప్రస్తుతం అధికారులు ఈ ఆరోపణలపై విచారణ చేపట్టారు.
Also Read : Russia-Ukraine War : జెలెన్ స్కీకి చెప్పు.. ఎలాగైనా దెబ్బకొట్టగలం.. పుతిన్ కౌంటర్..!