Medico Preethi Case : మెడికో ప్రీతి మృతి కేసు.. పోలీసుల విచారణలో సైఫ్ కీలక విషయాలు వెల్లడి

మెడికో ప్రీతి మృతి నిర్ధారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితుడు సైఫ్ ను పోలీసులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. ప్రీతి మృతి నిర్ధారణకు ఫోరెన్సిక్ నివేదిక, టాక్స్ కాలజీ నివేదిక కీలకం కానున్నాయి.

Medico Preethi Case : మెడికో ప్రీతి మృతి కేసు.. పోలీసుల విచారణలో సైఫ్ కీలక విషయాలు వెల్లడి

preeti case (1)

Updated On : March 4, 2023 / 1:22 PM IST

Medico Preethi Case : మెడికో ప్రీతి మృతి నిర్ధారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితుడు సైఫ్ ను పోలీసులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. ప్రీతి మృతి నిర్ధారణకు ఫోరెన్సిక్ నివేదిక, టాక్స్ కాలజీ నివేదిక కీలకం కానున్నాయి. అయితే హైదరాబాద్ ల్యాబ్, గాంధీ ఆస్పత్రి నుంచి వరంగల్ పోలీసులకు ఇంకా నివేదికలు అందలేదు. ప్రీతి మృతి కేసులో సైఫ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. పోలీసుల విచారణలో నిందితుడు సైఫ్ కీలక విషయాలు వెల్లడిస్తున్నారు.

నిందితుడి సెల్ ఫోన్ నుంచి 17 చాట్స్ ను స్వాధీనం చేసుకుని డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు.. సాంకేతికంగా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సైఫ్ కు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రీతితో ఎందుకు గొడవ తలెత్తింది? ప్రీతిని ఎందుకు వేధించాడు? తోటి మెడికోలకు ప్రీతి గురించి ఎందుకు చెప్పాడు అనే అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Medico Preethi Case : మెడికో ప్రీతి కేసు.. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓడీపై వేటు

పోలీసుల విచారణలో సైఫ్ ఒక్కో విషయం చెబుతున్నాడు. ప్రీతి అపస్మార స్థితికి వెళ్లిన రోజు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. ప్రీతిని టార్గెట్ చేయాలని సీనియర్ భార్గవ్ ను కోరినట్లు కూడా చెప్పాడు. ఆమెకు రెస్టు లేకుండా డ్యూటీ వేయాలని మరో డాక్టర్ కు సూచించినట్లు ఒప్పుకున్నాడు. ప్రీతి ఆత్మహత్య కేసులో మొత్తం 44 చాట్స్ కు సంబంధించిన సాంకేతి ఆధారాలపై పోలీసులు అవగాహనకు వచ్చారు.

విచారణ వివరాలను పోల్చుకుంటూ మరోసారి పోలీసులు సీన్ రీ చెక్ చేస్తున్నారు. డాక్టర్ సైఫ్ పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించాడనేదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణలో 27 స్క్రీన్ షాట్స్, మెసేజ్ లు కీలకంగా మారాయి. ప్రీతి బ్యాగ్ నుంచి పోలీసులు 24 ఆధారాలను సేకరించారు. హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్, సెక్యూరిటీ గార్డులు సామరాజు, కిషోర్ నుంచి వివరాలు సేకరించారు.

Medico Preethi Case : మెడికో ప్రీతి కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన సోదరుడు

ముగ్గురు మహిళా డాక్టర్ల చాట్ వివరాలను సేకరించారు. తొమ్మిది మంది అందించిన ఆధారాలతో దర్యాప్తు కొనసాగుతోంది. రేపటి(ఆదివారం)తో జ్యూడీషియల్ రిమాండ్ ముగియనుండటంతో ఇవాళ (శనివారం) కీలక అంశాలపై నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సైఫ్ చెప్పిన వివరాల ఆధారంగా మరో నలుగురిని ప్రశ్నించామని ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు.