అయ్యోపాపం : స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ బాలుడుని ఢీకొట్టాడు.

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 07:00 AM IST
అయ్యోపాపం : స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ బాలుడుని ఢీకొట్టాడు.

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ బాలుడుని ఢీకొట్టాడు. దాంతో ఆ బాలుడు అక్కడిక్కడే మరణించాడు. ఇంటిముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయస్సున్న బాలుడిని గురువారం ఉదయం(మార్చి14, 2019) కమ్మగూడా లోటస్ లాప్ స్కూల్ బస్ ఢీకొంది.
Read Also : కాపురంలో ‘దున్నపొతు’ చిచ్చు.. భార్య కాళ్లను నరికేసిన భర్త

అనంతరం డ్రైవర్ బస్సును ఆపకుండానే వెళ్లిపోయాడు. ప్రమాదంలో గాయపడిన బాలుడు తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు, స్థానికులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. స్కూల్ గేట్‌కి తాళం వేసి షెట్టర్ మూసి యాజమాన్యం నడుపుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.