వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

తెలంగాణలో రహదారులు రక్తమోడాయి. జనగామ, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 10:54 AM IST
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

Updated On : October 4, 2019 / 10:54 AM IST

తెలంగాణలో రహదారులు రక్తమోడాయి. జనగామ, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు.

తెలంగాణలో రహదారులు రక్తమోడాయి. జనగామ, వరంగల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం బంజార దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పసికందు సహా నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.