Shot Dead: పంజాబ్‌లో శివసేన నేత సుధీర్ సూరి దారుణ హత్య
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షూటింగ్ ప్రదేశం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరుపుతూ కెమెరాకు చిక్కాడు. కాగా, ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానిక నేతలు నిరసనలకు దిగారు

Shiv Sena leader Sudhir Suri shot dead in Amritsar
Shot Dead: పంజాబ్‌లోని అమృత్‌సర్ పట్టణంలో పట్టపగలే దారుణం జరిగింది. పంజాబ్‌కు చెందిన శివనేత నేత సుధీర్ సూరి శుక్రవారం హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి సుధీర్‌పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. ఆలయం వెలుపల ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన కొందరు నేతలు నిరసన తెలుపుతుండగా అక్కడి గుంపులోంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. షూటింగ్ ప్రదేశం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరుపుతూ కెమెరాకు చిక్కాడు. కాగా, ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానిక నేతలు నిరసనలకు దిగారు. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి పంజాబ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలినట్టు శివసేన పంజాబ్ అధ్యక్షుడు యోగిరాజ్ శర్మ విమర్శించారు.
Priyanka Gandhi: కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘అగ్నిపథ్’ రద్దు చేస్తాం: ప్రియాంకా గాంధీ