రూల్స్ రూల్సే : నందమూరి తారకరత్న రెస్టారెంట్ కూల్చివేత

  • Published By: chvmurthy ,Published On : February 4, 2019 / 08:56 AM IST
రూల్స్ రూల్సే : నందమూరి తారకరత్న రెస్టారెంట్ కూల్చివేత

Updated On : February 4, 2019 / 8:56 AM IST

హైదరాబాద్ : సీనీ హీరో నందమూరి తారకరత్న నిబంధనలకు విరుధ్దంగా నడుపుతున్న రెస్టారెంట్ ను జీహెచ్ ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేయటానికి సిధ్దమయ్యారు.  బంజారా హిల్స్ రోడ్ నెంబరు 12 లో తారకరత్నకు చెందిన  కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వహణపై స్ధానికుల నుంచి ఫిర్యాదు రావటంతో జీహెచ్ఎంసీ అధికారులు రెస్టారెంట్ కూల్చివేతకు సోమవారం ఉదయం  ప్రయత్నించారు. దీంతో రెస్టారెంట్ ఉద్యోగులు జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు.

 

విషయం తెలుసుకుని రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన తారకరత్న జీహెచ్ ఎంసీ అధికారులతో మాట్లాడి కొంత సమయం కోరారు. అందుకు అంగీకరించిన అధికారులు 3 గంటల సమయం ఇచ్చారుయ గడువు లోగా రెస్టారెంట్ లో సామాగ్రి తరిలించేందుకు సిబ్బంది సమాయత్తమయ్యారు.  

డ్రైవ్ ఇన్ రెస్టారెంట్  నిబంధనలకు విరుధ్దంగా రెసిడెన్షియల్ ఏరియాలో నిర్వహిస్తున్నారని,  రాత్రి వేళల్లో రెస్టారెంట్ కు వచ్చే వారు  మద్యం తాగుతూ, డీజే సౌండ్స్ తో న్యూసెన్స్ చేస్తున్నాని స్ధానిక ఎమ్మెల్యే కాలనీ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయటంతో జీహెచ్ ఎంసీ అధికారులు చర్యలు తీసుకోటానికి వచ్చారు.