న్యాయం చేయమంటే అత్యాచారం చేశాడు : గుంటూరులో ఎస్సై నిర్వాకం

  • Published By: chvmurthy ,Published On : January 29, 2020 / 11:25 AM IST
న్యాయం చేయమంటే అత్యాచారం చేశాడు : గుంటూరులో ఎస్సై నిర్వాకం

Updated On : January 29, 2020 / 11:25 AM IST

న్యాయం  చేయమని  పోలీసు స్టేషన్ కు వచ్చిన యువతిని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ స్టేషన్ ఎస్ఐ. అదే స్టేషన్ లో పని చేసే మరో కానిస్టేబులు బాధితురాలి తల్లిని లాడ్జికి రమ్మని కోరాడు. ఏపీ లో దిశా చట్టాన్ని అమలు చేస్తున్నా… చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘించి కామాంధులుగా మారి దారుణాలు చేస్తున్నారు. 
 

వివరాల్లోకి వెళితే   గుంటూరు శారదా నగర్ లోనివసించే యువతిని డేవిడ్ అనే వ్యక్తి  ప్రేమ  పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో బాధిత యవతి గుంటూరులోని అరండల్ పేట పోలీసు స్టేషన్లో  డేవిడ్ పై ఫిర్యాదు చేసింది. అయితే స్టేషన్ ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేయకుండా బాధిత యువతిని తన ఇంటికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడని బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.  
 

కాగా… ఇదేస్టేషన్ లో పని చేస్తున్నరాము అనే మరోక కానిస్టేబులు బాధిత యువతి తల్లిని లాడ్జికి రమ్మని కోరినట్లు బాధితురాలు ఆరోపించింది. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు.