Delhi-Meerut Expressway : ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురి మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ నగరంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఓ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికి అక్కడే మరణించారు....

Bus, Car Collision on Delhi-Meerut Expressway
Delhi-Meerut Expressway : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ నగరంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఓ బస్సు, కారు ఢీకొన్నాయి. (Bus, Car Collision) ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికి అక్కడే మరణించారు. వేగంగా వస్తున్న బస్సు, కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
Bengal Panchayat Election Result : భారీ బందోబస్తు మధ్య బెంగాల్ పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ
ప్రమాద స్థలంలో రోదనలతో మార్మోగిపోయింది. ఘజియాబాద్ (Ghaziabad) పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు. రిపబ్లిక్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాహుల్ విహార్ వద్ద లాల్ కౌన్- ఢిల్లీ 9వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని రూరల్ జోన్ డీసీపీ చెప్పారు. వేగంగా వచ్చిన బస్సు కారును ఢీకొట్టింది. కారులో చిక్కున్న మృతదేహాలను పోలీసులు కట్టర్ల సాయంతో కట్ చేసి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.