విషాదం : తండ్రి అంతిమయాత్రలోనే తనయుడు మృతి

సిరిసిల్ల : అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అంతిమయాత్రలోనే కొడుకు కుప్పకూలాడు. సిరిసిల్ల జిల్లా గుండారంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. తండ్రి చనిపోయిన కొద్దిగంటల్లోనే తనయుడు తనువు చాలించడం సిరిసిల్ల జిల్లా గుండారం గ్రామంలో విషాదం నింపింది.
జజ్జరి నర్సయ్య అనారోగ్యంతో ఇవాళ ఉదయం మరణించారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన తనయుడు రాజయ్య.. అంతిమయాత్రలో గుండెపోటుతో కుప్పకూలాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు.. రాజయ్య చనిపోయినట్టు నిర్ధారించారు. ఇంటికి పెద్ద దిక్కయిన ఇద్దరూ కన్నుమూయడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.