SR Nagar Gold Ornaments Case : రూ.7కోట్ల విలువైన బంగారు నగలతో ఉడాయించిన కారు డ్రైవర్ కోసం పోలీసుల వేట
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో నగల చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం చేశారు పోలీసులు. డ్రైవర్ శ్రీనివాస్ కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. నిన్న మధురానగర్ లో బంగారం డెలివరీ ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ తో పాటు డ్రైవర్ వెళ్లాడు. ఎగ్జిక్యూటివ్ వచ్చేలోగా కారు, నగలతో ఉడాయించాడు డ్రైవర్ శ్రీనివాస్.

SR Nagar Gold Ornaments Case : హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో నగల చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం చేశారు పోలీసులు. డ్రైవర్ శ్రీనివాస్ కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. నిన్న మధురానగర్ లో బంగారం డెలివరీ ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ తో పాటు డ్రైవర్ వెళ్లాడు. ఎగ్జిక్యూటివ్ వచ్చేలోగా కారు, నగలతో ఉడాయించాడు డ్రైవర్ శ్రీనివాస్.
రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ రెండు నెలల క్రితం బంగారు వ్యాపారి రాధిక దగ్గర డ్రైవర్ గా చేరాడు. అదను చూసి బంగారంతో ఉడాయించాడు. విజయవాడ రూట్ లో కారు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
రూ.7 కోట్ల విలవైన బంగారు ఆభరణాలతో డ్రైవర్ పరారైన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది. నగల వ్యాపారం చేసే రాధిక మాదాపూర్‌లో నివాసం ఉంటున్నారు. హోల్ సేల్ గా నగలుకొని ఫ్రెండ్స్, బంధువులకు అమ్ముతుంటారు. వచ్చిన ఆర్డర్ల ప్రకారం నగలను సప్లయ్ చేస్తుంటారు. రాధిక ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఉండే అనూష రూ.50 లక్షలు విలువ చేసే నగలను ఆర్డర్ ఇచ్చారు. నగల డెలివరీ విషయమై రాధిక అనూషకి ఫోన్ చేయగా, అనూష బంధువుల ఇంటి వద్ద ఉన్నానని అక్కడికి పంపించమని రాధికను అడిగింది. దీంతో అనూష చెప్పిన మధురానగర్ లోకేషన్‌కి రాధిక సేల్స్ మెన్ ను, కారు డ్రైవర్ తో నగలను పంపించింది.
డెలివరీ చేయాల్సిన నగలతో పాటు జెమ్స్ అండ్ జువెల్లర్స్‌కు ఇవ్వాల్సిన రూ.6.5 కోట్ల విలువైన వజ్రాభరణాలు కారులో తీసుకెళ్లారు. డెలివరీ కోసం మధురానగర్ లో లొకేషన్ చేరుకున్నారు. సేల్స్ మెన్ కారు దిగాడు. డ్రైవర్ శ్రీనివాస్ మాట మాట కలుపుతూనే ఒక్క క్షణంలో కారుతో ఉడాయించాడు. దీంతో.. సేల్స్ మెన్ షాక్ కి గురయ్యాడు. వెంటనే విషయాన్ని రాధికకు తెలిపాడు. ఈ ఘటనపై రాధిక ఎస్ఆర్ నగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం వెతకడం ప్రారంభించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కారు నెంబర్, సీసీ ఫుటేజ్ ఆధారంగా శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. నాలుగు టీమ్ లుగా ఏర్పడి శ్రీనివాస్ జాడ కోసం జల్లెడ పడుతున్నారు. సేల్స్ మెన్ ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.