వీడు మనిషి కాదు : 12మంది యువతులపై అత్యాచారం
ఏలూరు: రాక్షసత్వం, జాలి దయ లేని కర్కశత్వం.. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ప్రేమ పక్షులను టార్గెట్ చేసుకొని గద్దల్లా

ఏలూరు: రాక్షసత్వం, జాలి దయ లేని కర్కశత్వం.. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ప్రేమ పక్షులను టార్గెట్ చేసుకొని గద్దల్లా
ఏలూరు: రాక్షసత్వం, జాలి దయ లేని కర్కశత్వం.. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ప్రేమ పక్షులను టార్గెట్ చేసుకొని గద్దల్లా వాలిపోతారు. డబ్బు కావాలంటూ బెదిరించి.. వారి వద్ద ఉన్నదంతా దోచేస్తారు. అంతటితో ఆగిపోదు ఈ కీచక బ్యాచ్.. ప్రియుడి ముందే ప్రియురాలిని చెరబడుతుంది. అడ్డువస్తే దాడి చేసైనా అనుభవిస్తారు. గుంటుపల్లి హత్యతో గుట్టు వీడుతున్న దండుపాళ్యం బ్యాచ్ కథ ఇది.
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధ ఆరామాల్లో ఫిబ్రవరి 24న ప్రేమ జంట నవీన్, శ్రీధరణిలపై దాడి జరిగింది. ఇందులో అత్యంత దారుణంగా శ్రీధరణి హత్య చేయబడగా.. నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఎత్తుకెళ్లిన ధరణి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు అంకమరావును కనుగొన్నారు. అతన్ని విచారిస్తే విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.
దాడి జరిగిన తెల్లారి అంకమరావుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారణ చేశారు. పోలీసుల విచారణలో నేరాన్ని తానే చేసినట్టు ఒప్పుకున్నాడు అంకమరావు. పోలీసులు తమ స్టైల్‌లో లోతుగా విచారించగా.. తన అకృత్యాల రికార్డును బయటపెట్టాడు. ఇప్పటికే 12మంది యువతులపై అత్యాచారం చేసినట్టు శ్రీధరణితో సహా నలుగురిని మట్టుబెట్టినట్టు అంగీకరించాడని తెలుస్తోంది. అంకమరావుతో పాటు మరో ఐదుగురు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. వీరంతా గ్రూప్‌గా, విడివిడిగా నేరాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ దండుపాళ్యం బ్యాచ్ ఫస్ట్… బీచ్‌లు, పార్క్‌ల వంటి ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తుంది. ప్రేమికులు ఏకాంతంగా ఎక్కడ గడుపుతున్నారనే విషయాన్ని గమనించి.. దగుల్బాజి పనికి పూనుకుంటుంది. కుదిరినప్పుడు గ్యాంగ్‌గా.. లేకుంటే ఒంటరిగానే లవర్స్ ఉండే ప్రాంతాలకు వెళ్లి వారిపై దాడి చేస్తారు ఈ నీచులు. అత్యంత కిరాతకంగా దాడి చేసి అమ్మాయిలను అనుభవిస్తారు. లొంగితే ఓకే లేదంటే.. తలపై, మెడపై దాడిచేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అమ్మాయిలపై అత్యాచారానికి ఒడిగడతారు. ఈ నీచ్ బ్యాచ్ దాడులు చేయడం, డబ్బు తీసుకోవడం, హత్యాచారం చేయడం లాంటి క్రూరమైన పనులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మనుషుల ప్రాణాలను తీసేటప్పుడు ఈ గ్యాంగ్ విచక్షణ కోల్పోతుందని పోలీసులు విచారణలో బయటపడినట్లు తెలుస్తుంది.
అంకమరావు.. తానేం చేస్తున్నాడు ఎటు వెళ్తున్నాడనే విషయం కనీసం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు. ఎక్కడివో తెలియదు కానీ.. ఆదివారం సెల్‌ఫోన్స్ తెచ్చాడని చెబుతోంది. మరోవైపు అంకమరావు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి అతని అత్తింటివారు భయంతో వణికిపోతున్నారు. విచారణలో భాగంగా పోలీసులు ఇంటికి వస్తుండటంతో బెదిరిపోతున్నారు. గుంటుపల్లి ఘటనతో కరుడుగట్టిన మానవ మృగాల విషయం వెలుగులోకి వచ్చింది. వీరు ఇంకెన్ని దారుణాలకు పాల్పడ్డారనే విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.