పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానం : తోటి మావోయిస్టును చంపేశాడు

బీహార్‌లో దారుణం జరిగింది. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానించి ఓ మావోయిస్ట్ తన సహచరుడినే చంపేశాడు. ఈ ఘటన ముంగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సత్‌దర్భ అటవీప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 12, 2019) రాత్రి 10 గంటలకు మృతుడు దినేశ్ కోడాను గుర్తించినట్లు ముంగర్ ఎస్పీ గౌరవ్ మంగ్లా తెలిపారు.
పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తూ..వారి నుంచి డబ్బు తీసుకుని పన్నుల రూపంలో వచ్చిన డబ్బును దుర్వినియోగం చేస్తున్నాడని రాసిన ఓ లేఖను కోడా మృతదేహంపై గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.