Tortured House Help: నాలుకతో టాయిలెట్ శుభ్రం చేయిస్తూ, యువతిని 8 ఏళ్ళుగా ఘోరంగా హింసించిన బీజేపీ నాయకురాలు.. అరెస్టు
ఓ అమ్మాయిని ఘోరంగా హింసింసింది ఓ బీజేపీ నాయకురాలు. యువతి నాలుకతో టాయిలెట్ శుభ్రం చేయిస్తూ, ఐరెన్ రాడ్ తో కొన్ని పళ్ళను ఊడగొట్టి, ఆహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆమెను నానా రకాలుగా వేధించింది. దీంతో నిందితురాలిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. బీజేపీ ఝార్ఖండ్ నాయకురాలు, మాజీ ఐఏఎస్ అధికారి భార్య సీమా పాత్ర ఇంట్లో సునీత (29) అనే ఓ గిరిజన యువతి పనిచేస్తోంది. సునీతను 8 ఏళ్ళుగా సీమా వేధిస్తోంది.

Tortured House Help
Tortured House Help: ఓ అమ్మాయిని ఘోరంగా హింసింసింది ఓ బీజేపీ నాయకురాలు. యువతి నాలుకతో టాయిలెట్ శుభ్రం చేయిస్తూ, ఐరెన్ రాడ్ తో కొన్ని పళ్ళను ఊడగొట్టి, ఆహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆమెను నానా రకాలుగా వేధించింది. దీంతో నిందితురాలిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. బీజేపీ ఝార్ఖండ్ నాయకురాలు, మాజీ ఐఏఎస్ అధికారి భార్య సీమా పాత్ర ఇంట్లో సునీత (29) అనే ఓ గిరిజన యువతి పనిచేస్తోంది.
ఆమెను గత ఎనిమిది ఏళ్ళుగా సీమా వేధిస్తోంది. సునీత శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. సునీత శరీరంపై సీమా వాతలు పెట్టేది. అయితే, సీమా పాత్ర కుమారుడు ఆయుష్మాన్ మంచివాడు కావడంతో సునీతను రక్షించాలని భావించాడు. తన ఇంట్లో జరుగుతోన్న ఘోరాన్ని తన స్నేహితుడు వివేక్ కు చెప్పాడు.
దీంతో వివేక్ ఈ విషయంపై రాంచీలోని అర్గోడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగస్టు 22న సునీతను పోలీసులు రక్షించి ఆ ఇంటి నుంచి తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాజాగా, సీమా పాత్రను బీజేపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.