బిడ్డ సేఫ్: పది నెలల పాపతో రైలు కిందపడ్డ తల్లి

బిడ్డ సేఫ్: పది నెలల పాపతో రైలు కిందపడ్డ తల్లి

Updated On : November 26, 2019 / 2:22 PM IST

పసికందుతో సహా ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.  22సంవత్సరాల వయస్సున్న మహిళ తమిళనాడులోని హోసర్ రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడేందుకు యత్నించింది. రైల్వే సిబ్బంది విషయాన్ని గమనించి పోలీసులకు తెలియజేసేలోపే ఆ మహిళ మృతి చెందింది.

చేతులు, తలకు తీవ్రంగా గాయం కావడంతో క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఇంతటి ప్రమాదం నుంచి ఆ పాప చిన్నపాటి గాయాలతో బయటపడింది. పోలీసు అధికారులు పసిపాను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవంతో పాటు లభించిన వస్తువుల ఆధారంగా సంబంధిత వివరాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.