అమ్మ శరవణా.. : స్మశానంలో డబ్బు మూటలు, బంగారు పెట్టెలు

స్మశానం అనగానే ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి.. ఆ తర్వాత బూడిద. ఇంకేముంటాయి అనుకునే వారికి ఇది షాకింగ్. ఆ స్మశానంలో మాత్రం డబ్బుల మూటలు ఉన్నాయి.. బంగారం పెట్టెలు ఉన్నాయి..

  • Published By: sreehari ,Published On : February 8, 2019 / 01:22 PM IST
అమ్మ శరవణా.. : స్మశానంలో డబ్బు మూటలు, బంగారు పెట్టెలు

Updated On : February 8, 2019 / 1:22 PM IST

స్మశానం అనగానే ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి.. ఆ తర్వాత బూడిద. ఇంకేముంటాయి అనుకునే వారికి ఇది షాకింగ్. ఆ స్మశానంలో మాత్రం డబ్బుల మూటలు ఉన్నాయి.. బంగారం పెట్టెలు ఉన్నాయి..

స్మశానం అనగానే ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి.. ఆ తర్వాత బూడిద. ఇంకేముంటాయి అనుకునే వారికి ఇది షాకింగ్. ఆ స్మశానంలో మాత్రం డబ్బుల మూటలు ఉన్నాయి.. బంగారం పెట్టెలు ఉన్నాయి.. వందల కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్ల ఫైళ్లు ఉన్నాయి.. చచ్చినోడు స్మశానంలో దాచిపెట్టారా ఏంటీ అనే డౌట్ వచ్చిందా.. కామన్ అందరికీ ఇదే వస్తుంది. ఈ సీన్ మాత్రం భిన్నం. నిక్షేపంగా బతికున్న ఓ పెద్ద పారిశ్రామికవేత్త.. తన బ్లాక్ మనీని దాచుకోవటానికి వేసిన స్కెచ్ ఇది. దేశం మొత్తం నివ్వెరపోయిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సశ్మానాలు, భవనాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. తవ్వుతున్న కొద్ది లెక్కలేని కోట్లాది రూపాయల గుట్టు వీడుతోంది. ఇంత సొమ్ము ఎక్కడిది.. ఎవరు దాచారు అనే కోణంలో ఐటీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. 

ఎన్ని కోట్లు కూడబెట్టినా చివరికి చట్టానికి చిక్కాల్సిందే. ఎన్నాళ్లూ సాగుతుంది ఈ దొంగాట. చివరికి కటకటాలు లెక్కించాల్సిందే. కోట్లాది రూపాయలు కూడబెట్టారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఎన్నో లాభాలు ఆర్జించారు. లెక్కలో లేని కోట్లాది రూపాలయలకు ఆదాయ పన్ను కట్టకుండా తప్పించుకున్నారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు. సశ్మానాల్లో, భవనాల్లో జరిపిన తవ్వకాల్లో భారీగా 25 కోట్ల నగదు, డాక్యుమెంట్లు, 15 కేజీల బంగారం, 626 క్యారెట్ల డైమండ్లు, మొత్తం కలిపి మూడు వ్యాపార సంస్థల్లో రూ.433కోట్ల దొరికినట్లు ఐటీ అధికారులు తెలిపారు. చెన్నై, కోయింబత్తూరులోని శరవణ స్టోర్స్ ‘బ్రహ్మండామయి’, రియాల్టీ సంస్థలైన లోటస్ గ్రూపు, జీస్య్కేయిర్ వంటి పలు సంస్థల్లో వారం రోజులకు పైగా ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏకకాలంలో శరవణ స్టోర్లకు సంబంధించిన 72 రియల్ ఎస్టేట్ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు.

ఐటీ అధికారులు రైడ్స్ చేయబోతున్నారనే సమాచారం ముందుగానే లీక్ కావడంతో శరవణ స్టోర్ యజమానులు యోగార్ధునమ్ పొందురై, సహాయకుడు రామజయం అలియస్ బాలా అక్కడి నుంచి పరారయ్యారు. ఒకవైపు తమ సంస్థల్లో ఐటీ అధికారులు జరుగుతుంటే.. తమ SUV వాహనాల్లో విలువైన డాక్యుమెంట్లు, భారీ నగదుతో చెన్నై సిటీ అంతా చుట్టేశారు. పోలీసుల సాయంతో ఐటీ అధికారులు ఎట్టకేలకు శరవణ స్టోర్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు. 

ఐటీ దాడులతో సంస్థ రికార్డులు, సీసీ ఫుటేజీ డిలీట్ 
ఐటీ దాడులు చేస్తున్నారని ముందుగానే తెలిసి భారీ నగదు, బంగారం, డైమండ్లను ఎస్ యూవీ కారులో దాచి సిటీ అంతా తిరగమని డ్రైవర్లకు చెప్పారు. ఇలోపు స్టోర్ లోని సిబ్బంది కంప్యూటర్ లో రికార్డులను డిలీట్ చేయమన్నారు. సంస్థల్లో ఉన్న సీసీ ఫుటేజీల రికార్డులను కూడా డిలీట్ చేసేశారు. సిబ్బందిని గట్టిగా ప్రశ్నించడంతో ఎస్ యూవీ కారులో క్యాష్ తరలిస్తున్నట్టు చెప్పారు. వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి విలువైన నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు తెలిపారు.

మిగతా నగదును ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు సశ్మానాల్లో తవ్వి నగదును పాతిపెట్టారని, సంస్థ భవనాలకు సమీపంలో తవ్వి అక్కడ కూడా విలువైన బంగారం, వజ్రాలను పాతిపెట్టినట్టు గుర్తించామని ఐటీ అధికారి చెప్పారు. శరవణ సంస్థలో జరిగిన లావాదేవీల్లో లెక్కలో లేని రూ.284 కోట్లు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. బాలాకు సంబంధించిన సంస్థల్లో రూ.149 కోట్లు ఉన్నట్టు గుర్తించారు. కంప్యూటర్ లో నుంచి డిలీట్ చేసిన డేటాను తిరిగి రికవర్ చేసేపనిలో ఐటీ సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. 

Read Also:  బీ అలర్ట్: ఆధార్‌తో లింక్ చేయలేదా.. పాన్ కార్డు క్యాన్సిల్