kuna Ravikumar Arrest : టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్-అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రభుత్వ మాజీ విప్, తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

kuna Ravikumar Arrest : టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్-అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు

Kuna Ravikumar Arrest

Updated On : November 21, 2021 / 1:46 PM IST

kuna Ravikumar Arrest :   ప్రభుత్వ మాజీ విప్, తెలుగుదేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను  నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా శాంతినగర్‌ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు తరలించించారు.

శుక్రవారం  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై అసెంబ్లీ సాక్షిలో   వైసీపీ నేతలు  చేసిన  అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై  రవి  కుమార్ దురుసుగా వ్యవహరించారని, టూ టౌన్ సిఐ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Snake Venom : అమ్మకానికి పాము విషం- ధర తెలిస్తే……
అర్థరాత్రి పూట రవికుమార్ ఇంతటితో పాటు, ఆయన సోదరుడు కూన సత్యారావు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. కూన రవికుమార్ సోదరి ఇంట్లో వున్నారన్న పక్కా సమాచారంతో ఇంటిని చుట్టుముట్టి, హై డ్రామా మధ్య పోలీసులు రవి కుమార్ ను అరెస్టు చేసారు.