దారుణం : విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారయత్నం

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 11:42 AM IST
దారుణం : విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారయత్నం

Updated On : February 27, 2019 / 11:42 AM IST

విశాఖ : పట్టణంలోని చీడికాడలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చీడికాడలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్లేందుకు ఫిబ్రవరి 26 మంగళవారం ఉదయం బస్సు కోసం ఎదురుచూస్తోంది. అటుగా వచ్చిన వేరే పాఠశాల ఉపాధ్యాయుడు (40) లిఫ్ట్‌ ఇస్తానని, బైక్‌పై ఎక్కాలని బాలికను కోరాడు. అందుకు మొదటగా ఆ బాలిక అంగీకరించలేదు. చివరికి విద్యార్థిని ఉపాధ్యాయుడి బైక్‌ ఎక్కగానే కొంతదూరం వెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.

బాలిక అరవడంతో ఆమెను దారుణంగా కొట్టాడు. బాలిక అరుపులు విని చుట్టుపక్కల ఉన్న రైతులు, కూలీలు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికపై దాడి చేసిన టీచర్‌ను పట్టుకొని తీవ్రంగా కొట్టి, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.