పోలీసుల చేతికి ధోనీ కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీనేజర్

పోలీసుల చేతికి ధోనీ కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీనేజర్

Updated On : October 12, 2020 / 8:25 AM IST

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS DHONI సరిగా ఆడటం లేదని.. అతని కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో నెటిజన్. ధోనీ అభిమానులతో పాటు పోలీస్ శాఖ వారిపై ఫైర్ అయింది. ఎంక్వైరీ వేసి ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. గుజరాత్ లోని ముంద్రాలో ఉండే 16ఏళ్ల వయస్సున్న టీనేజర్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘నామ్నా కపాయా గ్రామంలో 12వ తరగతి చదువుతున్న వ్యక్తి.. ధోనీ భార్య సాక్షి ధోనీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ అనుచిత కామెంట్ పోస్టు చేశాడు’ అని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సౌరబ్ సింగ్ వెల్లడించారు. IPL 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ మెసేజ్ వచ్చింది.



రాంచీ పోలీసులు ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకుని నిర్థారించుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. హాని తలబెడతాననే మెసేజ్ చేసింది తానే అని ఒప్పుకున్నాడు. తానే పోస్టు చేసినట్లు అంగీకరించాడు.

రాంచీ సిటీలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీస్ స్టేషన్‌కే ఆ టీనేజర్‌ను అప్పగించాం. అని రాంచీ పోలీసులు తెలిపారు. క్రికెటర్లు సరిగా పర్‌ఫార్మ్ చేయకపోతే కుటుంబానికి తలపెడతామంటూ సోషల్ మీడియాలో పలు మార్లు ఇలా వార్నింగ్స్ వస్తూనే ఉన్నాయి.