Minister Srinivas Goud Gun Fire : తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. ఫ్రీడమ్ ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు. మహబూబ్ నగర్ లో పోలీసుల తుపాకీ తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్ తో గాలిలోకి కాల్పులు జరిపారు.

minister Srinivas Goud gun fire
minister Srinivas Goud gun fire : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. ఫ్రీడమ్ ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు. మహబూబ్ నగర్ లో పోలీసుల తుపాకీ తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్ తో గాలిలోకి కాల్పులు జరిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాలుస్తున్నా.. పోలీసులు అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం. అనంతరం ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మంత్రి వ్యహారం శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Srinivas Goud : కేసీఆర్‌ను టచ్ చేస్తే దేశమే భగ్గుమంటుంది, పేదల అకౌంట్‌లో రూ.15లక్షలు ఎక్కడ?
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోల్ చేస్తున్నారు.