Fake Rpf SI Arrested : పెళ్లి చూపులకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది.. నకిలీ మహిళా ఎస్ఐ బాగోతం బట్టబయలు

పెళ్లి చూపులకు కూడా పోలీస్ యూనిఫామ్ లోనే వెళ్లింది. అయితే, అబ్బాయి తరుపు వారికి ఎక్కడో అనుమానం వచ్చింది. అంతే.. ఆరా తీయగా షాకింగ్ నిజం తెలిసింది.

Fake Rpf SI Arrested : పెళ్లి చూపులకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది.. నకిలీ మహిళా ఎస్ఐ బాగోతం బట్టబయలు

Police Arrest Fake Rpf SI

Updated On : March 20, 2024 / 10:46 PM IST

Fake Rpf SI Arrested : ఎప్పటి నుంచో చిన్న ఆశ. జీవితంలో ఎప్పటికైనా పోలీసు ఉద్యోగం సాధించాలనే పట్టుదల. కానీ, కంటిచూపు లోపంతో ఉద్యోగం చేజారింది. పోలీస్ కావాలనే కోరిక తీరలేదు. ఎలాగైనా పోలీస్ అనిపించుకోవాలని డిసైడ్ అయిపోయిన ఓ యువతి పెద్ద కన్నింగ్ ప్లానే వేసింది. ఇంకేముంది ఆర్పీఎఫ్ ఎస్ఐ అవతారం ఎత్తింది. అలా ఏడాది పాటు ఎస్ఐగా హల్చల్ చేసింది. చివరికి పెళ్లి చూపుల కారణంగా ఆమె బాగోతం బట్టబయలైంది. నకిలీ ఎస్ఐ కటాకటాల పాలైంది.

కంటి సమస్య వల్ల చేజారిన ఎస్ఐ ఉద్యోగం..
నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన మాళవిక 2018లో ఆర్పీఎఫ్ లో ఎస్ఐ పోస్టు కోసం పరీక్ష రాశారు. అయితే, ఆమెకు మెల్లకన్ను ఉండటంతో మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. దీంతో ఎస్ఐ ఉద్యోగానికి ఆమె అనర్హురాలు అయ్యింది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆర్పీఎఫ్ నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తింది. పోలీస్ డ్రెస్, ఐడీ కార్డుతో ఆర్పీఎఫ్ ఎస్ఐగా చెలామణి అయ్యింది మాళవిక. పోలీసు డ్రెస్ తో ఆలయాల్లో వీఐపీ దర్శనాలతో పాటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంది.

ఎక్కడికి వెళ్లినా పోలీస్ డ్రెస్ లోనే..
ఎక్కడికైనా పోలీస్ డ్రెస్ లోనే వెళ్లేది మాళవిక. పలు కార్యక్రమాల్లో పోలీస్ డ్రెస్ లో హాజరై మహిళా సాధికారతపైన స్పీచ్ లు కూడా ఇచ్చింది. ఈ మధ్య మాళవికకు పెళ్లి చూపు అయ్యాయి. పెళ్లి చూపులకు కూడా పోలీస్ యూనిఫామ్ లోనే వెళ్లింది. అబ్బాయి తరుపు వారికి ఎక్కడో అనుమానం వచ్చింది. అంతే ఆరా తీయగా షాకింగ్ నిజం తెలిసింది. మాళవిక బండారం బయటపడింది. ఆమె నకిలీ ఎస్ఐ అని తేలింది.

ఇంట్లో వాళ్లు బాధపడతారని, ఊరి వాళ్లు వెక్కిరిస్తారని నకిలీ ఎస్ఐ అవతారం..
ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంఎస్సీ వరకు చదివింది మాళవిక. రైల్వే ఎస్ఐ కావాలన్న తన డ్రీమ్ ను నిజం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ, మెడికల్ టెస్టులో ఫెయిల్ కావడంతో జాబ్ చేజారిపోయింది. అప్పటికే మాళవికకు జాబ్ కన్ ఫామ్ అయ్యిందన్న ప్రచారం జరగడంతో ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు హ్యాపీగా ఫీలయ్యారు. ఊరిలో అంతా ఆమెను ఎస్ఐ అయిపోయింది అని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు జాబ్ రాలేదనే నిజం తెలిస్తే ఇంట్లో వాళ్లు బాధపడతారని, ఊరి వాళ్లు వెక్కిరిస్తారని మాళవిక కన్నింగ్ ప్లాన్ వేసింది. నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తింది. అలా ఏడాది పాటు నకిలీ ఎస్ఐ పాత్రలో కంటిన్యూ అయ్యింది. చివరికి ఆమె పాపం పండింది. పెళ్లి చూపులకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది. పెళ్లి చూపుల ద్వారా నకిలీ ఎస్ఐ మాళవిక బండారం బట్టబయలైంది. మాళవిక నకిలీ పోలీసు అనే నిజం తెలిసి అంతా విస్తుపోతున్నారు.

Also Read : ఇద్దరు చిన్నారుల కిరాతక హత్య.. హంతకుడిని ఎన్‌కౌంట‌ర్‌ చేసిన పోలీసులు