News Channel Anchor: తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ బలవన్మరణం.. హైదరాబాద్ లోని ఇంట్లో ఉరి వేసుకుని.. కారణం అదేనా..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యాంకర్ స్వేచ్ఛ మరణానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.

News Channel Anchor: ఓ తెలుగు న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న స్వేచ్ఛ బలవన్మరణం చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన ఇంట్లో ఉరి వేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురికీ తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యాంకర్ స్వేచ్ఛ మరణానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.
స్వేచ్ఛ పలు న్యూస్ ఛానల్స్ లో యాంకర్ గా పని చేసింది. మీడియా రంగంలో ఎంతో యాక్టివ్ గా ఉంది. ఈ విషయం తెలిసి స్వేచ్ఛ స్నేహితులు షాక్ కి గురయ్యారు. శోక సంద్రంలో మునిగిపోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో స్వేచ్ఛ తన కూతురితో నివాసం ఉంటుంది. ఇటీవలే అరుణాచలంలోని దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. వెంటనే స్పాట్ కి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు.
Also Read: ఆ నీళ్లు తాగొద్దు.. హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరిక.. పీసీబీ నివేదికలో షాకింగ్ విషయాలు
మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికీ తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఆరా తీస్తున్నారు. పూర్ణచంద్ర అనే స్నేహితుడు తనతో సన్నిహితంగా ఉంటున్నాడని యాంకర్ స్వేచ్ఛ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియజేసింది. లివింగ్ రిలేషన్ లో ఉంటున్నట్లు అనేకసార్లు ఆమె ప్రకటించింది. నిన్న ఒక్కసారిగా కుటుంబంలో తగాదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు డ్యూటీకి వెళ్లి వచ్చాక స్వేచ్ఛ బలవన్మరణం చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. స్వేచ్ఛ ఇక లేదు అనే వార్తను తోటి యాంకర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.