Woman Arrest: 80వేల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో 100కోట్లు దోచేసింది.. బౌద్ధ సన్యాసులే ఆమె టార్గెట్.. దేశాన్ని కుదిపేస్తున్న కుంభకోణం.. ఎవరీ విలావన్..

ఇటీవల ఒక మఠాధిపతి అకస్మాత్తుగా సన్యాసాన్ని విడిచి పెట్టాడు. అంతేకాదు అదృశ్యం అయ్యాడు. ఈ కేసుని విచారిస్తుండగా..

Woman Arrest: 80వేల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో 100కోట్లు దోచేసింది.. బౌద్ధ సన్యాసులే ఆమె టార్గెట్.. దేశాన్ని కుదిపేస్తున్న కుంభకోణం.. ఎవరీ విలావన్..

Updated On : July 18, 2025 / 11:25 PM IST

Woman Arrest: బౌద్ధ సన్యాసులే ఆమె టార్గెట్.. వారితో లైంగిక సంబంధాలు నెరిపింది.. వారితో గడిపిన సమయంలో వేల సంఖ్యలో ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసుకుంది.. ఆ తర్వాత వాటితో బ్లాక్ మెయిల్ చేసి ఏకంగా 100 కోట్లు సంపాదించింది. థాయిలాండ్‌లో అతి పెద్ద లైంగిక, దోపిడీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ కిలేడీని అరెస్ట్ చేశారు. ఇప్పుడీ స్కాండల్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సన్యాసులు బ్రహ్మచర్య ప్రతిజ్ఞను ఉల్లంఘించడం పెను దుమారం రేపుతోంది. ఇంకా షాకింగ్ ఏంటంటే.. ఈ కుంభకోణంలో 9 మంది మఠాధిపతులు, సీనియర్ సన్యాసులకు ప్రమేయం ఉందని రాయల్ థాయ్ పోలీస్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది.

ఎవరీ విలావన్ ఎంసావత్?
ఆ కిలేడీ పేరు విలావన్ ఎంసావత్. వయసు 30 ఏళ్లు. బ్యాంకాక్‌కు ఉత్తరాన ఉన్న నోంతబురిలోని ఆమె విలాసవంతమైన ఇల్లు ఉంది. అక్కడే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘Mrs. గోల్ఫ్‌’గా పేరు మార్చుకుని లైంగిక సంబంధాలు నెరిపిన ఆ మహిళపై దోపిడీ, మనీలాండరింగ్ తదితర కేసులు నమోదయ్యాయి.

ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్నవి చూసి షాక్ కి గురయ్యారు. బౌద్ధ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో సందేశాలు, సన్నిహిత వీడియోలు, ప్రైవేట్ ఫోటోలు గుర్తించారు. వాటి అడ్డు పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి సంపాదించిన డబ్బును ఆమె ఆన్‌లైన్ జూదంలో భారీగా ఖర్చు చేయడానికి ఉపయోగించిందని పోలీసులు కనుగొన్నారు.

Also Read: ఏంటీ నాన్ వెజ్ మిల్క్..? ఎందుకింత వివాదంగా మారింది, భారతీయులు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..

కొంతమంది సన్యాసులు విలావన్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. వారు సోషల్ మీడియాలో ఆమెని సంప్రదించినట్లు తెలిసింది. తాను చాలా కాలంగా ఆమెతో రిలేషన్ లో ఉన్నానని ఒక సన్యాసి తెలిపాడు. ఇంతలోనే ఆమెలో మార్పు వచ్చిందని, మరో సన్యాసిని చూసుకుందని చెప్పాడు. అంతేకాదు తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించిందన్నాడు.

80వేల ప్రైవేట్ ఫొటోలతో రూ.102 కోట్లు దోపిడీ..
విలావన్ ఎంసావత్ ఇంట్లో జరిపిన సోదాల్లో బౌద్ధ సన్యాసులతో ఆమె లైంగిక చర్యలకు పాల్పడిన 80వేల ఫోటోలు, వీడియోలు దొరికాయని పోలీసులు తెలిపారు. వీటిని సన్యాసులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించిందన్నారు. అలా ఆ కిలేడీ గత మూడేళ్లలో దాదాపు రూ.102 కోట్లు దోచేసిందని వెల్లడించారు.

ఇటీవల బ్యాంకాక్‌లోని ఒక మఠాధిపతి అకస్మాత్తుగా సన్యాసాన్ని విడిచి పెట్టాడు. అంతేకాదు అదృశ్యం అయ్యాడు. ఈ కేసుని విచారిస్తుండగా ఈ భారీ కుంభకోణం బయటపడింది. విలావన్ ఎంసావత్ బ్లాక్‌మెయిల్ నుండి తప్పించుకోవడానికి అతను కనిపించకుండా పోయాడని పోలీసుల విచారణలో తెలిసింది.

ఈ భారీ స్కాండల్ వెలుగులోకి వచ్చాక.. ప్రసిద్ధ దేవాలయాలకు చెందిన మఠాధిపతులు సహా సన్యాసులను విధుల నుండి తొలగించారు. సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న మహిళలపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని సెనేట్‌లోని ఒక కమిటీ ప్రతిపాదించింది. దీనిపై విస్తృత స్థాయి విచారణకు థాయ్‌ ప్రభుత్వం ఆదేశించింది. బ్రహ్మచర్యం పాటించాల్సిన నియమాన్ని బౌద్ధ సన్యాసులు ఉల్లంఘించడం పట్ల అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

థాయిలాండ్‌లో 90 శాతం కంటే ఎక్కువ మంది బౌద్ధులు. 2 లక్షల మంది సన్యాసులు ఉన్నారు. బౌద్ధ సన్యాసుల లైంగిక స్కాండల్‌ వ్యవహారం ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇకపోతే బౌద్ధ సన్యాసుల సమాజానికి సంబంధించిన కుంభకోణాలు థాయిలాండ్‌లో కొత్తేమీ కాదంటున్నారు అక్కడి పోలీసులు.