America Firing : అమెరికా టెక్సాస్ లో కాల్పుల కలకలం.. ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు

క్లీవ్ ల్యాండ్ లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిందితుడి సమాచారం అందిస్తే 80 వేల డాలర్లను పారితోషికంగా ఇస్తామని ప్రకటించారు.

America Firing : అమెరికా టెక్సాస్ లో కాల్పుల కలకలం.. ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు

America Firing

Updated On : May 1, 2023 / 12:20 PM IST

America Firing : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లోని క్లీవ్ ల్యాండ్ లో దారుణం జరిగింది. దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే కాల్పులు ఆపమన్నందుకు ఐదుగురిని కాల్చి చంపాడు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లీవ్ ల్యాండ్ కు చెందిన ఫ్రాన్సిస్ స్కో ఓరోపెసా(38) అనే వ్యక్తి ఏఆర్-15 స్టైల్ రైఫిల్ తో శుక్రవారం రాత్రి ప్రాక్టీస్ చేస్తున్నాడు.

అయితే కాల్పుల శబ్ధానికి పొరుగు ఇంట్లో ఉన్న ఓ 8 ఏళ్ల బాలుడు నిద్ర లేచాడు. దీంతో తమ నిద్రకు భంగం కలుగుతుందని, కాల్పులు ఆపాలని ఆ వ్యక్తిని బాధిత కుటుంబం కోరారు. కానీ, ఓరోపెసా వారి మాటలు వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా వారిపై కాల్పులు జరపడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. కాల్పులు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.

America Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు మృతి, మరో ఆరుగురికి గాయాలు

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి ఆచూకీ కోసం 200 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లీవ్ ల్యాండ్ లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిందితుడి సమాచారం అందిస్తే 80 వేల డాలర్లను పారితోషికంగా ఇస్తామని ప్రకటించారు.