కుటుంబంలో విషాదం నింపిన టిక్ టాక్.. తల్లి, కొడుకు సూసైడ్ 

  • Published By: murthy ,Published On : May 19, 2020 / 11:24 AM IST
కుటుంబంలో విషాదం నింపిన టిక్ టాక్.. తల్లి, కొడుకు సూసైడ్ 

Updated On : May 19, 2020 / 11:24 AM IST

సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. టిక్ టాక్ వీడియోలు చేయవద్దని భర్త మందలించాడని సూసైడ్ చేసుకుంది ఓ ఇల్లాలు. తల్లి మరణం తట్టుకోలేని కొడుకు పురుగుల మందు తాగి తనువు చాలించాడు.

విజయవాడ శివారు జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి తన భార్యను టిక్ టాక్ వీడియోలు చేయవద్దని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆస్పత్రికి తరలించే లోగానే కన్ను మూసింది.

వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కుమారుడు మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య  చేసుకున్నాడు. ఒక్కరోజు వ్యవధిలోనే ఒక కుటుంబంలోని ఇద్దరు ప్రాణాలు విడవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read: 13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 37ఏళ్ల వ్యక్తి