హ్యాక్ చేసేశారు: TikTokనూ వదల్లేదుగా

లోకల్ ఆర్టిస్టుల ప్లాట్ ఫాం టిక్ టాక్ వచ్చిన కొద్ది కాలంలోనే యూజర్లను అభిమానులను లక్షల్లో పెంచుకుంది. ఈ పోటీకి తట్టుకోలేక యాప్ ను క్లోజ్ చేయాలని కోర్టుకెక్కిన సందర్భాలు ఉన్నాయి. కేసులను గెలిచి మళ్లీ వాడకంలోకి వచ్చిన టిక్ టాక్ కు పెద్ద కష్టం వచ్చి పడింది. హాకర్లు ఈ సోషల్ మీడియా అకౌంట్ ను కూడా టార్గెట్ చేశారు.
ఎంటర్‌టైన్మెంట్ యాప్ ను హ్యాక్ చేస్తే ఏం వస్తుందనుకోవద్దు. అక్కడే అంతా అసలు టెక్నిక్. సాధారణంగా ఈ యాప్ వాడేముందు ఫోన్ యాక్సెస్ అడుగుతుంది కదా. దీంతో యూజర్ అకౌంట్ ను హ్యాండిల్ చేయడం ఈజీ. ఇలా యాప్ అకౌంట్ ను హ్యాక్ చేసి ముందుగా అందులో ఉన్న ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చేశారు. ఆ తర్వాత ఫోన్ పై మరింత కంట్రోల్ సాధించారు.
వీటిని అమెరికన్ ఆర్మీ ముందుగానే పసిగట్టింది. అందుకే టిక్ టాక్ ను పూర్తిగా బ్యాన్ చేసింది. గవర్నమెంట్ కోసం పనిచేసే సైనికులు, ఇతర అధికారుల ఫోన్లను టార్గెట్ గా చేస్తున్న హ్యాకర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో మనుగడకు ప్రమాదం అని భావించిన టిక్ టాక్ సెక్యూరిటీ లోపాలను సరిదిద్దుకుంది.
అసలు ఎలా హ్యాక్ చేస్తారంటే:
టిక్ టాక్ యాప్ డౌన్ లోడ్ చేసే సమయంలో proxy tool లేదా spoof message వస్తుంది. క్షణాల్లో వచ్చే ఆ లింక్ ను పొరబాటున క్లిక్ చేస్తే చాలు. ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయినట్లే. వెంటనే ఫోన్‌ను మేలిసియస్ వెబ్‌సైట్లకు రీ డైరక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి వెనక్కు వచ్చినా.. హ్యాకర్లు Cross-Site Scripting (XSS), Cross-Site Request Forgery (CSRF), Sensitive Data Exposure attacksలను టార్గెట్ చేసే అవకాశముంది.
యూజర్ల సెక్యూరిటీకి బాధ్యత వహిస్తూ.. సెక్యూరిటీ చెక్ పాయింట్ ను ఏర్పాటు చేసింది. లేటెస్ట్ వర్షన్ యాప్‌లో ఇటువంటివేమీ లేకుండా జాగ్రత్త పడింది. సెక్యూరిటీ రీసెర్చర్స్ నుంచి ఎటువంటి సమస్యలు లేకపోవడంతో దీనిని లాంచ్ చేస్తున్నట్లు టిక్ టాక్ సెక్యూరిటీ టీం తెలియజేసింది.