స్నేహితుడు పట్టించుకోవట్లేదని విద్యార్థి ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : November 7, 2019 / 04:41 AM IST
స్నేహితుడు పట్టించుకోవట్లేదని విద్యార్థి ఆత్మహత్య

Updated On : November 7, 2019 / 4:41 AM IST

స్నేహితుడు విస్మరిస్తున్నాడు..పట్టించుకోవడం లేదు..అంటూ తీవ్రమనస్థాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటన తిరుపతిలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటు చేసుకుంది. ఆ స్నేహితుడికి గుర్తుగా తన ప్రాణం ఇస్తున్నా అంటూ సూసైడ్ రాసి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిపోయిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. 

వివరాల్లోకి వెళితే…
శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాలలో వేణుగోపాల్ బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ అనుబంధ వసతి గృహంలో ఉంటున్నాడు. ఇతనిది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మట్టిపల్లె గ్రామం. మొదటి రెండేళ్లు హాస్టల్‌లో ఉంటూ చదివాడు. NCCలో చురుగ్గా ఉండేవాడు. కొన్ని కారణాలతో ఈ సంవత్సరం హాస్టల్ ఖాళీ చేసి బయట అద్దెకు రూం తీసుకుని ఉంటున్నాడు. అయితే..2019, నవంబర్ 06వ తేదీ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బాత్ రూంకి వెళ్లిన..వేణు గోపాల్ శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

మంటల బాధకు తాళలేక కేకలు వేశాడు. స్థానికులు 108కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడ సూసైడ్ లెటర్ లభించింది. ‘తొందరపాటులో చేసిన చిన్న తప్పు వల్ల తన స్నేహితుడు నన్ను పూర్తిగా విస్మరించాడు. మూడు నెలలుగా నరకయాతన అనుభవించాను. నన్ను క్షమించు. స్నేహానికి గుర్తుగా నా ప్రాణం ఇస్తున్నా’ అంటూ వేణుగోపాల్ లేఖలో వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఈస్ట్ సీఐ తెలిపారు. 
Read More : విజయవాడ – గుంటూరులకు కొత్త రూపు