ATM Robbery : ఏటీఎం కాలిపోయిందని రూ. 52 లక్షలు కాజేశారు

ఏటీఎంలలో డబ్బులు పెట్టే సిబ్బంది ఏటీఎం కాలిపోయిందని అబధ్ధం ఆడి రూ.52 లక్షలు కాజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

ATM Robbery :  ఏటీఎం కాలిపోయిందని రూ. 52 లక్షలు కాజేశారు

ATM Robbery

Updated On : October 22, 2021 / 5:52 PM IST

ATM Robbery :  ఏటీఎంలలో డబ్బులు పెట్టే సిబ్బంది ఏటీఎం కాలిపోయిందని అబధ్ధం ఆడి రూ.52 లక్షలు కాజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏటీఎం సెంటర్లలో డబ్బులు నింపే ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది రోజు డబ్బులు నింపుతున్నారు. ఇన్నాళ్ళుగా డబ్బు నింపుతున్న వాళ్లకు మనసులో దుర్భుద్ద్ధి పుట్టింది. డబ్బు కాజేయాలని ప్లాన్ వేశారు.

ఏటీఎంను తగల బెట్టించి, డబ్బు కాలిపోయిందని నాటకం ఆడి, నమ్మించే ప్రయత్నం చేశారు. ఏటీఎం కాలిపోయిందని సంబంధిత కార్యాలయంలో సిబ్బంది చెప్పారు. ఈఘటనలో మొత్తంగా రూ. 52 లక్షలు తేడా రావటంతో కార్యాలయం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : Pocso case: కీచక మామపై పోక్సో కేసు నమోదు..!

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు ఇది ఇంటి దొంగల పని అని అర్ధం అయ్యింది. కాలిపోయిన ఏటీఎం లో రెగ్యులర్ గా నగదు నింపే వ్యక్తుల వివరాలు సేకరించారు. ఈ ముఠాలో 8 మంది హస్తం ఉన్నట్లు తెలుసుకున్నారు. అందులో 5గురుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు నేరం ఒప్పుకున్నారు. వారి వద్దనుంచి రూ.6.7 లక్షలు రికవరీ చేశారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.